వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య చెల్లెలితో సహజీవనం, మరో మహిళతో శృంగారం, నగ్న వీడియోలతో డబ్బు డిమాండ్

|
Google Oneindia TeluguNews

కృష్ణా: భార్య చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు మరో మహిళనూ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో గడిపిన శృంగార దృశ్యాలను బహిర్గత పరుస్తానంటూ బెదిరింపులకు గురిచేచేసి.. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజుకున్నాడు. అతని వేధింపులు బరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ నయవంచకుడి దుర్మార్గాలు వెలుగుచూశాయి.

పోలీసుల కథనం ప్రకారం కృష్ణలంకకు చెందిన మండవ రవికాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు వివాహమైంది. కాగా, భార్య చెల్లెలు శ్రీదేవి‌పై కన్నేసిన రవికాంత్ ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలెట్టాడు. ఈ క్రమంలో శ్రీదేవి తన భర్తకు విడాకులిచ్చి అజిత్‌సింగ్‌నగర్ రామలింగేశ్వరపేటకు మాకాం మార్చింది.

రామలింగేశ్వనగర్‌లో నివాసం ఏర్పాటు చేసి శ్రీదేవితో సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు రవికాంత్. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఇంటికి సమీపంలో ఉంటున్న మరో మహిళ (39)తో పరిచయం ఏర్పడింది. ఈమె కూడా భర్త నుండి విడాకులు పొందింది. ఈమె ఇద్దరు సంతానం ఉన్నత చదువులు చదువుతున్నారు.

arrest

సదరు మహిళ తన తండ్రి పెన్షన్‌తో జీవనం సాగిస్తోంది. కాగా, మోసపూరిత మాటలు చెప్పిన రవికాంత్.. ఆమెతో చనువు పెంచుకున్నాడు. సదరు మహిళతో గడిపిన శృంగార దృశ్యాల్ని తన సెల్‌ఫోన్‌లో బంధించి మహిళను బ్లాక్‌మెయిల్ చేసి తనకు డబ్బులు అవసరమైనప్పడల్లా ఆ మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో నిస్సహాయురాలైన మహిళ తన తండ్రి నుండి తీసుకున్న రూ.6 లక్షల్ని రవికాంత్‌కు ఇచ్చింది.

అనంతరం తనను వేధించవద్దని ఆమె వేడుకుంది. నిస్సహాయురాలైన ఆ మహిళ విడాకుల విషయాన్ని కూడా పక్కన పెట్టి తన భర్త చెంతకు చేరాలని ఆకాంక్షించింది. ఆ విషయాన్ని గ్రహించిన ఏలాగో గ్రహించాడు. .. సదరు మహిళ నగ్న చిత్రాల్ని ఆమె భర్తకు చేరవేశాడు. దీంతో ఆమె కాపురం మరోసారి చిన్నాభిన్నమైంది.

అన్ని వైపులనుంచి దారులు మూసుకుపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. చివరకు అతని వేధింపులు బరించలేక పోలీసులను ఆశ్రయించింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X