హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: మర్రి, సిఎం వ్యాఖ్యల పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Marri Sasidhar Reddy
న్యూఢిల్లీ: కేంద్రం హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమైన సమయంలో తెలంగాణ ప్రాంత నాయకులు సీమాంధ్రులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయవద్దని సనత్ నగర్ సీనియర్ కాంగ్రెసు శాసన సభ్యుడు, జాతీయ ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆదివారం సూచించారు.

రాష్ట్ర విభజన వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని కొంతమంది నేతల రెచ్చగొట్టడం వల్లన సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అపోహలను కేంద్రం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రాంత అభివృద్ది కోసం తాను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మర్రి తెలిపారు. 1956 నుంచి ఎపి రాజధానిగా ఉన్న హైదరాబాదు అభివృద్ధికి అన్ని ప్రాంతాల వారు శ్రమించారన్న సత్యాన్ని కొట్టిపారేయలేమన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ వైపు నుంచి ద్వేషభావం పెంచే ప్రకటనలు విరమించుకోవాలన్నారు. హైదరాబాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు, వారి ఆస్తులకు భరోసా ఇవ్వాలని, అప్పుడే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు.

English summary
Sanat Nagar senior Congress MLA Marri Sasidhar Reddy on Sunday said Centre will give Telangana along with Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X