సినీ నటి నీతూ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నా: మస్తాన్ వలీ
అనంతపురం: సినీతార నీతూ అగర్వాల్‌ను తాను పెండ్లి చేసుకున్నానని, హైదరాబాద్‌లో తాము కాపురం చేస్తున్నామని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరస్టైన నిందితుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మస్తాన్‌వలీ తెలిపారు. అనంతపురం వన్‌టౌన్‌లో నమోదైన ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం జిల్లాకు వచ్చిన మస్తాన్ వలీ కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాను గతంలో కమిషన్ కోసం ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశానని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి దూరంగా ఉంటున్నానని వివరించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు కుట్రపన్ని కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ప్రేమ ప్రయాణం సినిమా నిర్మాణం సమయంలో హీరోయిన్ నీతూతో పరిచయం ఏర్పడిందన్నారు.

నీతూకి ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సినీనటి నీతూ అగర్వాల్‌పై కేసు నమోదు చేశామని కర్నూలు ఎస్పీ ఏ రవికృష్ణ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
మస్తాన్‌వలీని అనంతపురం పోలీసులు ఒక బొలెరో వాహనం దొంగతనం కేసులో ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ కింద అనంతపురం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నాలుగు రోజులు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. దీంతో మస్తాన్ వలీని ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
తాను ప్రేమ ప్రయాణం పేరుతో రూ.1.2 కోట్లతో సినిమా తీశానన్నారు. తానూ, నీతూ కలసి తలా 15 లక్షల రూపాయలు పెట్టి రూ.30 లక్షలతో హైదరాబాద్‌లో అపార్ట్‌మెంటు కొన్నా మన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమ పార్టీ అధినేత జగన్‌ను కలుస్తానని తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications