Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యాన్స్ కు మెగాస్టార్ థాంక్స్ - ఆపద వేళ అండగా..!!

ఆపద సమయంలో మెగా సైన్యం కదలింది. రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టేందుకు సహకరించింది. ఒడిశా రైలు ప్రమాదం దేశంలో ప్రతీ ఒక్కరినీ కలిచి వేసింది. 300 మంది ప్రాణాలు కోల్పోయారు వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘోర ప్రమాదం సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అభిమానులకు పిలుపు ఇచ్చారు. అన్నయ్య పిలుపుతో భారీ సంఖ్యలో అభిమానులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పెద్ద సంఖ్యలో రక్త దానం చేసారు.

గత శనివారం ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీ కొన్నాయి. దశాబ్ద కాలంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పలువురు ప్రముఖులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీలు..సినీ ప్రముఖులు..సెలబ్రెటీస్ ఈ జాబితాలో ఉన్నారు. అందులో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు.

Chiranjeevi says thanks To Mega Fans

కరోనా సమయంలో తన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి ఆక్సిజన్ సిలిండర్లు అందించిన చిరంజీవి..ఈ ఘోర ప్రమాద సమయంలో బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రమాద బాధితులకు రక్తదానం చేయాలని సూచించారు. దీంతో పెద్ద సంఖ్యలో మెగా ఫ్యాన్స్ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

ప్రస్తుతం రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో తిరిగి రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రుల్లో క్షతగాత్రులు కోలుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వారిని సొంత ప్రాంతాలకు తరలించారు. ఈ సమయంలో అభిమానులు అందించిన సాయం పైన మెగాస్టార్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.

'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్‌ ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మెగాస్టార్ తాజా సినిమా భోలా శంకర్ సినిమాలో ఒక మేకింగ్ వీడియోను చిరు లీక్స్ పేరుతో విడుదల చేసిన మెగాస్టర్ ఫ్యాన్స్ కు మరింత ఆసక్తిని పెంచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+