HBD YSJagan: సీఎం జగన్‍కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..
సీఎం జగన్‍కు జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "వైఎస్ జగన్ కు 50వ జన్మదిన శుభాకాంక్షలు" అని చిరు ట్వీట్ చేశారు. అంతుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ కూడా జగన్‍కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హీరో రవితేజ కూడా జగన్ కు
బర్త్ డే విషెస్ చెప్పారు.

చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక గత కొద్ది రోజులుగా సీఎం జగన్ వైసీపీపై నిప్పులు చెరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఉదయం ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా జగన్ కు శభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యంగా ఉండాలి ఆకాంక్షించారు.

గవర్నర్
గవర్నర్, పలువురు కేంద్ర మంత్రులు, వ్యాపార - సినీ ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నేతలు ముఖ్యమంత్రిని గ్రీట్ చేసారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం జన్మదిన వేడకలు నిర్వహించారు.
రక్త దానం శిబిరాలు
ముఖ్యమంత్రి జన్మదినం కావటంతో ఆయన అభిమానులు..వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహించారు. రక్త దానం శిబిరాలు ఏర్పాటు చేశారు.క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు.

ప్రధాని మోడీ
జగన్ కు ప్రధాని మోడీ విషెస్ చెప్పారు. సీఎం జగన్ జన్మదినం కావటంతో ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం జగన్ ను శుభాకాంక్షలు చెప్పారు. సంతోషంగా జీవించాలని ఆకాక్షించారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సీఎంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు.












Click it and Unblock the Notifications