హైదరాబాద్ 10కే రన్: ఆ అపురూప క్షణాలు చూస్తానో లేదోనన్న మిల్కాసింగ్ (ఫోటోలు)
హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న హైదరాబాద్10 కే రన్ ఆదివారం ఉదయం మరోసారి ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మిల్కాసింగ్ మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడంవల్ల మరింత కాలం పాటు ఆరోగ్యంతో ఉండవచ్చని తెలిపారు. హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు మిల్కాసింగ్ ఆటోగ్రాఫ్ ను తీసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
నెక్లెస్‌రోడ్డులో ఆదివారం జరగనున్న హైదరాబాద్ 10కె రన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన మిల్కాసింగ్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం నిర్వహించిన పాస్టా పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ రన్‌లో పాల్గొనే పలువురు లాంగ్ డిస్టెన్స్ రన్నర్లకు.. రేసుకు ముందు రోజు సమతుల ఆహారం అందించే ఉద్దేశంతో హైదరాబాద్ 10కె రన్ ఫౌండేషన్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అథ్లె ట్లు, నిర్వాహకులతో మి ల్కాసింగ్ ముచ్చటించాడు.
మిల్కా సింగ్ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చా. ఈ నగరం నాకు దేవాలయంతో సమానం. మిల్కా ప్రయాణం మొదలైంది ఇక్కడేనని చెప్పుకొచ్చారు. 1951లో అథ్లెటిక్స్‌లో ఓనమాలు నేర్చుకుంది సికింద్రాబాద్ లోనేనని చెప్పారు.
ఈఎంఈ సెటంర్ తరుపున మొదటిసారి పరుగెత్తా. నా పేరుతో స్టేడియం కట్టినందుకు ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరిన 15 రోజుల తర్వాత క్రాస్ కంట్రీ రేసులో పరుగెత్తానని అన్నారు. ఇక 1960లో రోమ్ ఒలింపిక్స్ 400 మీ పరుగులతో పతకం చేజారడంపై పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ దురదృష్టకర సంఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఒలింపిక్స్‌కు ముందు 400 మీటర్లలో 80 రేసుల్లో పోటీపడి 77 గెలిచా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుస్తానని ప్రపంచమంతా అనుకుంది. కానీ నేను పతకం సాధించలేదు. నేను బతికుండగానే ఓ భారతీయుడు ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ పతకం గెలవాలన్నది నా కోరిక. ఆ అపురూప క్షణాలు చూస్తానో లేదోనని చెప్పారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
ఈ సందర్భంగా మిల్కాసింగ్ మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడంవల్ల మరింత కాలం పాటు ఆరోగ్యంతో ఉండవచ్చని తెలిపారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
మిల్కా ప్రయాణం మొదలైంది ఇక్కడేనని చెప్పుకొచ్చారు. 1951లో అథ్లెటిక్స్‌లో ఓనమాలు నేర్చుకుంది సికింద్రాబాద్ లోనేనని చెప్పారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
అంతక ముందు మిల్కా సింగ్ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చా.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
ఈ నగరం నాకు దేవాలయంతో సమానం. మిల్కా ప్రయాణం మొదలైంది ఇక్కడేనని చెప్పుకొచ్చారు. 1951లో అథ్లెటిక్స్‌లో ఓనమాలు నేర్చుకుంది సికింద్రాబాద్ లోనేనని చెప్పారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
ఈఎంఈ సెటంర్ తరుపున మొదటిసారి పరుగెత్తా. నా పేరుతో స్టేడియం కట్టినందుకు ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరిన 15 రోజుల తర్వాత క్రాస్ కంట్రీ రేసులో పరుగెత్తానని అన్నారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
ఇక 1960లో రోమ్ ఒలింపిక్స్ 400 మీ పరుగులతో పతకం చేజారడంపై పలు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్10 కే రన్‌ను ప్రారంభించిన లెజెండ్ అథ్లెట్ మిల్కాసింగ్
ఈ దురదృష్టకర సంఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఒలింపిక్స్‌కు ముందు 400 మీటర్లలో 80 రేసుల్లో పోటీపడి 77 గెలిచా. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుస్తానని ప్రపంచమంతా అనుకుంది.












Click it and Unblock the Notifications