వాలంటీర్ల పై నిర్ణయం మారేనా - ప్రభుత్వం క్లారిటీ..!!
ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారికి పది వేలు వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, గత ప్రభుత్వంలోనే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ నాడు నిర్ణయం తీసుకోలేదని..అమల్లో లేని వాలంటీర్లను తాము ఎలా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రశ్ని స్తోంది. ఇక, ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
వాలంటీర్ల పై చర్చ
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ పైన ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయలేదని.. మనుగడలో లేదని స్పష్టం చేసారు. విధుల్లో లేని వాలంటీర్లతో నాటి ప్రభుత్వం పనులు చేయించుకుందని మండిపడ్డారు. వారితో ఎన్నికల సమయంలో రాజీ నామాలు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రభుత్వం క్లారిటీ
వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకోని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను.. ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. గతంలో శాసన మండలిలో చర్చ సమయంలో వైసీపీ నేత బొత్సా వాలంటీర్ల జీవో ఇచ్చి ఉండకపోతే.. రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీ సారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి వారికి రూ 10 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేసారు. అయితే, అసలు మనుగడలో లేని వ్యవస్థ కు జీతాలు ఏ విధంగా చెల్లిస్తారని మంత్రి ప్రశ్నించారు. గతంలో పవన్ వద్దకు సర్పంచ్ ల సంఘ నేతలు వచ్చి వాలంటీర్ల అంశం ప్రస్తావన చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇక లేనట్లేనా
వాలంటీర్లు వ్యవస్థలోనే లేరని పవన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ ప్రతీ నెలా కొనసాగిస్తోంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే సమయంలో వాలంటీర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఇటీవలే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొంత విడుదల చేశామని చెప్పారు. గత ప్రభుత్వం తాలూకూ పెండింగ్ కూడా విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications