జగన్ ఎక్కడ చదివాడో, ఏం చదివాడో ఎవరికి తెలుసు ?, మంత్రి నారా లోకేష్ సైటర్లు
గత వైసీపీ ప్రభుత్వం లో విద్యా శాఖను జగన్ అంతగా ఉద్ధరించివుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందో అని సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విషయంలో జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
జగన్ అప్పట్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. మా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నదని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో జీవితాల గురించి ఆలోచిస్తామని, నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం నుండి పరీక్షా విధానంలో మార్పులు తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

వచ్చే సంవత్సరం ఆరవ తరగతి నుండి సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ ఎక్కడ చదివాడో, అసలు ఆయన ఏం చదివాడు ఆయనకే తెలియదని, ఇప్పుడు ఆయన విద్యా శాఖ గురించి మాట్లాడడం వినడానికే వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ వ్యంగంగా అన్నారు. ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు లేకుండానే జగన్ నిర్ణయాలు తీసుకున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో సీబీఎస్ఈ పరీక్షలు రాయించడానికి అంగీకరించిన అప్పటి జగన్ ప్రభుత్వం వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని నారా లోకేష్ ఆరోపించారు. కనీస అవగాహన లేకుండా అప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్ష విధానంలో మార్పులు తీసుకొస్తామని, ఆరవ తరగతి నుండి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాయడానికి వారిని సిద్ధం చేస్తామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications