జగన్ కు ప్రతిపక్ష నేత హోదా పై తేల్చేసారు...!!

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. తాజాగా జగన్ సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసారు. సీఎం చంద్రబాబు, మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించటం పైన జగన్ స్పీకర్ కు లేఖ రాసారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే డిసైడ్ అయినట్లున్నారని ఆక్షేపించారు. జగన్ లేఖ పైన మంత్రి పయ్యావుల తమ వైఖరి తేల్చి చెప్పారు.

జగన్ లేఖతో
జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా పైన స్పీకర్ కు రాసిన లేఖ పైన పలువురు మంత్రులు స్పందించారు. ఇప్పుడు అధికారికంగా శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ కు ప్రతిపక్షహోదా లేకుండా చేసింది తాము కాదని..ప్రజలే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. జగన్ ఇప్పటికైన మంచి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. జగన్ లేఖలో ప్రస్తావించినట్లుగా ఉమ్మడి ఏపీ సభ లో పి జనార్ధన్ రెడ్డికి సీఎల్పీ నేత హోదానే ఉందని..ప్రతిపక్ష నేత హోదా లేదని గుర్తు చేసారు.

Minister Payyavula Kesav Reacts over Jagan s letter to speaker on his Oppostion leader status

తేల్చేసిన కేశవ్
జగన్ తనకు ఓట్లు వేసిన ప్రజలను తప్పుబడుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో కాంగ్రెస్ కు 2014-2019, 2019-24 వరకు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఆ హోదా దక్కిందని వివరించారు. వైసీపీ సైతం పదేళ్ల పాటు పోరాటం చేసి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో సభలో ఏ పార్టీకి చెందిన సభ్యులు ఉన్నా..వారికి పార్టీ పక్ష నేతగా మాత్రమే గుర్తింపు ఉండేదన్నారు. ఇప్పుడు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నా...మూడు పార్టీలకు శాసనసభా పక్ష నేత ఉంటారని స్పష్టం చేసారు.

Minister Payyavula Kesav Reacts over Jagan s letter to speaker on his Oppostion leader status

ప్రతిపక్ష నేత హోదా లేనట్లే
ఇక, జగన్ సైతం తన పార్టీ పక్ష నేతగానే ఉంటారని వెల్లడించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని పయ్యావుల తేల్చి చెప్పారు. స్పీకర్ ను బెదిరించేలా లేఖలు రాయటం సరి కాదన్నారు. లేఖ రాయాలని జగన్ కు ఎవరు సలహా ఇచ్చారో అర్దం కావటం లేదన్నారు. ప్రజా తీర్పును జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేసారు. రూల్స్ బుక్ జగన్ చదువుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో జగన్ మిత్రుడు కేసీఆర్ సైతం నాడు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కేశవ్ ప్రకటనతో జగన్ కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష నేత హోదా దక్కదని తేలిపోయింది. ఇక.. జగన్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+