పిచ్చోడి చేతిలో రాయి: మంత్రి నారాయణపై ఎమ్మెల్యే
మంత్రి నారాయణపై నెలూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. నారాయణకు నెల్లూరు జిల్లా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తమ మాట వినకపోతే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.వాళ్లు చెప్పినట్లు వినకపోతే బదిలీ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలను జనచైతన్య యాత్రలంటూ మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలూరు నగరం అధికార పార్టీ నేతల అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అనిల్ ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, పోలీసు వ్యవస్థను టీడీపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications