మేకపాటి ఫ్యామిలీలో కలకలం - 18 ఏళ్ల "రహస్య" బంధం..!?
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా సమస్యలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పుడు కుటుంబ వివాదం బయటకు వచ్చింది. 18 ఏళ్ళు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ వైరల్ అవుతోంది. తనకు కుమారుడు లేడంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించటాన్ని ఆ లేఖలో ప్రశ్నించారు. మరి..తనెవరు అంటూ శివ చరణ్ రెడ్డి నిలదీసారు. ఈ మేరకు ఫొటోలు విడుదల చేసారు.
మేకపాటి వ్యక్తిగత..కుటుంబ వ్యవహారం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తల్లి తరువాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశావంటూ శివ చరణ రెడ్డి రాసిన లేఖ బయటకు వచ్చింది. కుమారుడిగా తనను ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. మేకపాటి తో ఉన్న ఫొటోను బయట పెట్టారు. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా అంటూ ప్రశ్నించారు. తానే మేకపాటి తనయుడిని అంటూ లేఖలో వివరించారు. శివ చరణ్ రెడ్డి రాసిన లేక..విడుదల చేసిన ఫొటో హాట్ టాపిక్ గా మారింది.

మేకపాటి చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి గత కొంత కాలంగా అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇప్పుడు శివ చరణ్ రెడ్డి విడుదల చేసిన లేఖ, ఫొటో కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీని పైన ఇప్పటి వరకు మేకపాటి చంద్రశేఖర రెడ్డి స్పందించలేదు. రాజకీయంగా ప్రముఖ వ్యక్తి కావటంతో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది. మరి చంద్రశేఖర్ రెడ్డి ఈ వివాదానికి ఏ రకంగా ముగింపు ఇస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications