మందు తాగి, పట్టుబడ్డ వైసీపీ మహిళా ఎమ్మెల్యే కూతురు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా పామర్రు శాసన సభ్యుడు ఉప్పులేటి కల్పన కుమార్తె ఉప్పులేటి కీర్తి సమత మద్యం మత్తులో వాహనం నడుపుతూ శనివారం రాత్రి హైదరాబాదులో పోలీసులకు పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన సమయంలో ఆమె దొరికారు.
ఈ విషయాలను ప్రత్యేక డ్రైవ్ ఇన్స్‌పెక్టర్ సుదర్శన్ వెల్లడించారు. శనివారం నాడు రాత్రి క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ప్రత్యేక తనిఖీలు చేపడుతున్న సమయంలో, అప్పుడే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు నుండి క్యాన్సర్ ఆసుపత్రి వైపు స్విఫ్ట్ కారు వస్తోందని, తాము తనిఖీలు చేయడాన్ని చూసి కారు వేగాన్ని తగ్గించారని చెప్పారు.

వెనక్కి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. దీనిని గుర్తించిన పోలీసులు కారును వెంబడించారని, కొంతదూరం వెళ్లాక కారును నిలువరించారన్నారు. తీరా చూస్తే కారు ఓ యువతి నడుపుతోందని చెప్పారు. ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగారని, తాను ఎమ్మెల్యే కుమార్తెనంటూ వాదించారని చెప్పారు.
పోలీసులు ఏమీ పట్టించుకోకుండా ఆమెకు పరీక్షలు చేశారని, 105 మిల్లీ గ్రాముల మద్యం ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో ఆమె పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారును సీజ్ చేశామన్నారు. ఆమె తన తల్లి పేరును ఉప్పులేటి కల్పన, తండ్రి దేవీప్రసాద్ అని చెప్పారని, ఆ పేర్లతోనే రశీదు ఇచ్చామన్నారు. సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications