ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఛాన్స్: వంశధార, నాగావళికి వరదపోటు

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొట్టాయి. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటింది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఈ ఉదయానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Moderate Rainfall Expected North Andhra as Vamsadhara and Nagavali getting huge inflow

ఈ భారీ వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి వరద ఉధృతి పెరుగుతుందని వివరించింది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నాగావళి కూడా వరద పెరిగే అవకాశం ఉన్నందున ఆయా నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

గొట్టా బ్యారేజ్ తో పాటు, తోటపల్లి వద్ద కూడా వరదనీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వచ్చిన వరద జలాలను వచ్చినట్టుగా దిగువకు వదలివేస్తోన్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 68,893 క్యూసెక్కులుగా నమోదైంది. ఇంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలివేస్తోన్నారు. తోటపల్లి వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇన్ ఫ్లో 30,840 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 14,970 క్యూసెక్కులుగా ఉంటోంది.

వర్షాల తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+