కిడ్నాప్ కేసులో ఏ2గా విష్ణు - పోలీసుల నోటీసులు..!!

మా అధ్యక్షుడు మంచు విష్ణు పైన కేసు నమోదైంది. మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి సంబంధించి.. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు పంపించారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది.

మోహన్ బాబు, విష్ణు పై కిడ్నాప్ కేసు ఇప్పుడు వైరల్ అవుతోంది. తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సీటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కొంత మంది విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలకు దిగారు. దీంతో కాలేజీ వద్ద పెద్ద రచ్చ జరిగింది. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులు భారీగా దొచుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి రెడీ అయిపోయారు. దీంతో మోహన్ బాబు బౌన్సర్లు ఇద్దరు విద్యార్థి నేతలను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అక్బర్, వినోద్ లపై బౌన్సర్ లు దాడులు చేసి, కారులో ఎక్కించుకుని కిడ్నాప్ కు పాల్పడినట్లు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారును వెంబడించి ఘటనకు కారణమైన పలువురిపై కేసుల్ని నమోదు చేశారు. దీనిలో మోహన్‌బాబు, విష్ణు, పీఆర్వో సతీష్‌పై సహా 13మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైంది.

mohan-babu-and-manchu-vishnu-in-kidnapping-case-university-tiruchanur-police-issues-notices

వరుస వివాదాలతో

తాజాగా.. ఈ కేసులో పోలీసులు మంచు విష్ణుకు తిరుచానురు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించారు. అయితే దీనిపై మంచు విష్ణు ఇప్పటికే పలు మూవీ షూటింగ్ లు షెడ్యుల్ ఖరారు అయిపోయిందని పోలీసులకు లిఖిత పూర్వకంగా చెప్పారు. ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు వస్తానని వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా పీఆర్వో సతీష్, ఏ2 గా మంచు విష్ణు, ఏ3గా మోహన్ బాబు పేర్లను పోలీసులు చేర్చారు. ఈ వివాదంతో మరోసారి మంచు కుటుంబం వార్తలలో నిలిచింది. మరోవైపు అధిక ఫీజులు వసూళ్లను ప్రశ్నిస్తే అరెస్టులు ఏంటని విద్యార్థి సంఘాలు నాయకులు మండిపడుతున్నారు. కిడ్నాప్ కేసులో పీఆర్వో సతీశ్(A1)తో పాటు పలువురు బౌన్సర్లు ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఇప్పటికే ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. దీంతో.. ఇప్పుడు మోహన్ బాబు, విష్ణు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+