పవన్ తో బాలశౌరి సమావేశం - నియోజకవర్గం ఖరారు..!!

ఏపీలో ఎన్నికల వేళ నేతల జంపింగ్స్ పెరిగాయి. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్దుల మార్పులో మచిలీపట్నం నుంచి బాలశౌరికి సీటు నిరాకరించారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరటానికి నిర్ణయించారు. తాజా భేటీలో బాలశౌరి పోటీ చేసే స్థానం పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది.

పవన్ తో భేటీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సమావేశం అయ్యారు. వైసీపీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని బాలశౌరి ఇటీవల రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, జిల్లా మంత్రి జోగి రమేశ్‌తో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు.

MP Balashowry meets Pawan Kalyan chances to contest for Guntur Loksabha from Janasena

అందులో భాగంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి స్థానంలో కొత్త అభ్యర్ది ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలోనే వైసీపీ వీడిన బాలశౌరి జనసేనలో చేరాలని నిర్ణయించారు. అందులో భాగంగా తాజాగా పవన్ తో సమావేశమైన బాలశౌరి వచ్చే ఎన్నికల్లో స్థానం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

సీటు పై చర్చలు: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం. కాకినాడ, మచిలీపట్నం సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అయితే, బాలశౌరి వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గుంటూరు సీటు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్దంగా లేదని చెబుతున్నారు.

బాలశౌరి 2004లో కాంగ్రెస్ ఎంపీగా తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో తెనాలి రద్దు కావటంతో నర్సరావుపేట నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలుపొందారు.

పార్టీలో ప్రాధాన్యత: బాలశౌరికి ఈ సారి జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే, పొత్తుల్లో సీట్ల పైన తుది నిర్ణయం తీసుకున్న తరువాత నియోజకవర్గం పైన నిర్ణయం తీసుకుందామని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీగా అవకాశం లేకపోతే ఎమ్మెల్యేగా ఇస్తారనే ప్రచారం ఉన్నా..బాలశౌరిని ఎంపీగానే పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలాఖరులోగా టీడీపీ, జనసేన సీట్ల షేరింగ్ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా జనసేనలో బాలశౌరికి ప్రాధాన్యత పైనా పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+