చంద్రబాబు అలా చెబితే, పవన్ కు మద్దతిస్తాం- వైసీపీ ఎంపీ కీలక ప్రకటన..!!

విశాఖలో పవన్ వర్సస్ వైసీపీ రాజకీయం వేడెక్కుతోంది. సీఎం జగన్, వైసీపీ నేతల లక్ష్యంగా పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. విశాఖలో వారాహి యాత్రలో భాగంగా పవన్ రుషికొండ ను సందర్శించారు. ఇతర భూములను పరిశీలించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పైన విరుచుకుపడ్డారు. తన పైన చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. పవన్ కు సవాల్ విసిరారు. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

కల్యాణ్‌ పై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు.. అసలు కాపు కులానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని, పవన్ కన్నా కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్ అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్.. తన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే మళ్లీ గాజువాకలో పోటీ చేయాలని, లేదా తనపై పోటీ చెయాలని సవాల్ చేశారు. విశాఖపట్నం అభివృద్ధిలో తన పాత్ర ఉందని, అనేక నిర్మాణాలు చేశానన్నారు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారని వ్యాఖ్యానించారు.

MVV Satya Narayana

పవన్ సీఎం అభ్యర్ధి అని చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు అలా చెబితే తామంతా మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. పవన్‌ తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన మాటలను పవన్ వక్రీకరించి మాట్లాడారని ఫైర్ అయ్యారు. విశాఖ వదిలి వెళ్లిపోతానని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. తనను రాజీనామా చేయమటానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిన పవన్ తన గురించి మాట్లాడుతారా అని నిలదీసారు. రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా పవన్‌కు లేదు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరన్నారు. పవన్ తీరు వీధి రౌడీలా ఉందని కామెంట్ చేసారు. పవన్‌ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని ఎంపీ ఎంవీవీ మండిపడ్డారు.

మాస్టర్‌ ప్లాన్‌ అంటే ఏంటో తెలుసా అని ఎంపీ ఎంవీవీ ప్రశ్నించారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు. కాపు కులస్తుల ఆత్మభిమానాన్ని రాజకీయం కోసం పవన్ వాడుకుం టున్నారని ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శించారు. రుషికొండ పైన పవన్ చేసిన ఆరోపణలకు మంత్రులు రోజా, అమర్నాధ్ మండిపడ్డారు. కోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తుంని మంత్రులు స్పష్టం చేసారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. పవన్ కు గీతం కాలేజీ చేసిన ఆక్రమణలు కనిపించలేదా అని నిలదీసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+