మీ ఇంట్లో మహిళలు లేరా - బండారు పై అమరావతి ఎంపీ ఫైర్..!!

మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. బండారు పైన సీరియస్ అవుతున్నారు. బండారు వ్యాఖ్యలను వరుసగా ఖండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల్లోని మహిళా నేతలు బండారు పైన మండిపడుతున్నారు. తాజాగా మహరాష్ట్రలోని అమరావతి ఎంపీ..మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా రియాక్ట్ అయ్యారు. బండారు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

మంత్రి రోజాకు మద్దతుగా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ముందుకు వచ్చారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో విడుదల చేసారు.''బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతారా అంటూ నిలదీసారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారని మండిపడ్డారు. మీకు రాజకీయాలు ముఖ్యమా.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండంటూ నవనీత్‌ కౌర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MP Navanet Rana Kaur Serious on TDP Leader Bandaru over his comments against Minister Roja
ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్‌ కౌర్‌ పేర్కొన్నారు. ''రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్‌ హీరోల సరసన నటించారు. ఆమెను ఇంతలా కించపర్చడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటమూ మంచిది కాద''ని నవనీత్‌ కౌర్‌ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్‌ నటులు కుష్బూ సుందర్‌, రాధికా శరత్‌కుమార్‌ రోజాకు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు నవనీత్‌ కౌర్‌ రాణా సైతం మద్దతుగా నిలిచారు. ఏపీలో సైతం రాజకీయాలకు అతీతంగా పలువురు మహిళలు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+