హీరోలకు అంత పారితోషకమా - గురి పెట్టారు, రాజ్యసభలో సాయిరెడ్డి..!!
సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో హీరోల రెమ్యునరేషన్ పైన జరిగిన చర్చలో సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు బడ్జెట్ లో హీరోలకు సింభగాగం వెళ్లే విధానం మారాలని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన వంటి బడా హీరోలు రూ 200 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
రెమ్యునరేషన్ పై కీలక వ్యాఖ్యలు:సినిమా హీరోల పారితోషకం పై రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, ఎంతో మంది కార్మికుల శ్రమ అని అన్నారు. సినిమా కోసం పని చేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని పేర్కొన్నారు. కష్టపడిన అందిరకీ సముచిత ప్రయోజనం చేకూరాలని సాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని కోరారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు.

పరిస్థితిలో మార్పు రావాలి:చిత్రపరిశ్రమలో పలు విషయాలను వెల్లడించారు. ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు లక్షల మందికిపైగా పని చేస్తున్నారని.. వారికి హీరోకు లభిస్తున్న మొత్తంలో మూడో శాతం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ 400 కోట్ల వ్యయంతో నిర్మించే సినిమాలో సగం భాగంగా హీరోల రెమ్యునరేషన్ కు వెళ్తుందన్నారు. నిర్మాణ వ్యయంలో సింహభాగం పారితోషకం తీసుకుంటున్న హీరోలే నిజమైన లబ్దిదారులవుతున్నారే తప్ప కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
హీరోల కుమారులకే అవకాశం:మన దేశంలో హీరోలుగా మారుతున్న హీరోల కొడుకుల కొంట అందగాళ్ళయిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారని.. వారికి మాత్రం అవకాశాలు దక్కడం లేదన్నారు. అలాగే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమామకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. దర్శకుడికి కేసుల నుంచి పూర్తిగా రక్షణ కల్పించాలని కోరారు. అదే హీరోల కూమార్తెలు హీరోయిన్లు అవుతున్నట్లుగా చూడలేమన్నారు. చైనా జనాభాను ఇండియా దాటి పోనప్పటికి థియేటర్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడిందన్నారు. సినిమా అనేది సామాన్యుడికి చౌకగా లభించే వినోదం కనుక.. దీనిని సామాన్యులందరికి అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలో థియేటర్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications