పవన్ కు ముద్రగడ సవాల్, సిద్దమేనా - ఆ అర్హత ఎక్కడిది..!!

ఏపీలో కాపు రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. కాపు వర్సస్ కాపు సమీకరణం మొదలైంది. కాపు ఉద్యమ నేత ముదగ్రడ జనసేనాని పవన్ ను లేఖలతో వెంటాడుతున్నారు. తాజాగా రాసిన లేఖలో సవాల్ చేసారు. కాకినాడ నుంచి పోటీకి తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీకి నిర్ణయం తీసుకొని తనను పోటీకి రావాలని సవాల్ చేయాలని కోరారు. తనను తిట్టి యుద్దానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించారన్న ముద్రగడ..అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని పవన్ ను ప్రశ్నించారు.

పవన్ కు ముద్రగడ మరో లేఖ
పవన్ కల్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖలో సంచలన అంశాలన ప్రస్తావించారు. ఎప్పుడూ పవన్ గురించి ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వని తనను తిట్టటం సబబేనా అని ప్రశ్నించారు. తనను పవన్ అభిమానులు బూతులు మెస్సేజలుగా పెడుతున్నారని..వాటికి భయపడిపోయి లొంగిపోతానని భావిస్తే..అది ఈ జన్మలో జరగదని ముద్రగడ పేర్కొన్నారు. తనను తిట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది.. మీ తొత్తుగా ఉండాలా..మీకు నాకు సంబంధం ఏంటని ముద్రగడ తన లేఖలో ప్రశ్నించారు. ఒంటరి వాడిని..ఏమన్నా పడతాననే గర్వమా అని పవన్ ను ప్రశ్నించారు. వంగావీటి రంగా నుంచి పలు అంశాలను ప్రస్తావించిన ముద్రగడ సమాధానం చెప్పాలా వద్దా నిర్ణయించుకోవాలని పవన్ కు సూచించారు.

Mudragada

పవన్ కు ముద్రగడ పశ్నలు
తుని ఘటన తరువాత కేసులు ఎదుర్కొన్న వారిని ఎప్పుడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కేసులు తుని కేసులను ఎత్తివేసారని తెలుసా అని అడిగారు. గోచీ, మొలత్రాడు లేని వారితో తిట్టించటం మొగతనం కాదని ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కాపుల నుంచి మాట్లాడే అర్హత పవన్ కు ఎక్కడదని ప్రశ్నించారు. ఏనాడైనా కాపుల గురించి ఆలోచించిన సందర్భం ఉందా అని నిలదీసారు. యువత భావోద్వేగాలను రెచ్చ గొడుతోంది ఎవరో మీ ప్రసంగాలు చూస్తూ అర్దం అవుతుందని పేర్కొన్నారు. కోనసీమ అల్లర్ల సమయంలో నిత్యం మీ కోసమే తపించే వారి కోసం ఏం చేసారని ప్రశ్నించారు. ద్వారంపూడితో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని..మీ కోసం వారిని దూరం చేసుకోలేనని ముద్రగడ స్పష్టం చేసారు.

Mudragada

పిఠాపురం నుంచి పోటీకి సవాల్
తనను తిట్టించినా డోన్ట్ కేర్ అంటూ ముద్రగడ పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు తోట త్రిమూర్తులు, ఆమంచి క్రిష్ణ మోహన్ తనతో పవన్ గురించి మూడు గంటల పాటు చర్చలు చేసిన అంశాన్ని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. పవన్ కోసం తాపత్రయపడిన వారిని ఓడించమని చెప్పటం ఏంటని పవన్ ను ముద్రగడ నిలదీసారు. తనను తిట్టాలంటే ప్రత్తిపాడు, అన్నవరం, కత్తిపూడిలోనే తిట్టాలని..కాకినాడ ఎమ్మెల్యే తో కలిపి ఎందుకు తిట్టారని ప్రశ్నించారు. కాకినాడ నుంచి పోటీకి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేసారు. చెగువేరా ఆదర్శమని చెప్పుకుంటారు.. గుండెల నుంచి ధైర్యం అని చెప్పుకొనే మీరు కాకినాడ..పిఠాపురం లో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి..పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. పరోక్షంగా పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు గా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+