సినిమాలు చేయాలంటే - పవన్ కు ముద్రగడ కీలక సూచన..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు నూతన అసెంబ్లీ కొలువు తీరింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇటు ముద్రగడ నాడు ఎన్నికల సమయంలో చేసిన సవాల్ లో ఓడటంతొ తన పేరు మార్చుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాల్లో నటించాలని నిర్ణయిస్తే పవన్ కు ముద్రగడ కీలక సూచన చేసారు. ఎన్టీఆర్ తరహాలో వ్యవహరించాలని సూచించారు.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అటు ఆయన చేతిలో సినిమాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు చేస్తారా..ఏం చేయబోతున్నారనే చర్చ ఉంది. ఈ సమయంలోనే ముద్రగడ స్పందించారు. పవన్ కళ్యాణ్ గతం లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత పూర్తిగా సినిమాలు మానేశారని గుర్తు చేసారు. ఒక సినిమాలో నటించ వలసి వస్తే కేంద్రం లేదా సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని నటించారని చెప్పుకొచ్చారు. పవన్ సైతం అదే బాటలో నడవాలని ముద్రగడ పేర్కొన్నారు.

పవన్ ను అభిమానించే వారు తమను బూతులు తిడుతున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసారు. అలా చేయవద్దని సూచించారు. తమ కుటుంబంలో ఏడుగురు ఉన్నారని..ఒకే సారి ఎవరినైనా పంపించి చంపేయండి అంటూ వాపోయారు. వైసీపీకి ఓటు వేసిన వారి పైన దాడులు వద్దని హితవు చెప్పారు. అమావాస్య తరువాత పౌర్ణమి వస్తుందని వ్యాఖ్యానించారు. అమాయకులపై దయచేసి దాడులు ఆపించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా తో పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్రీవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయాలని సూచించారు. తన పేరు మార్పులో ఎవరి ఒత్తిడి లేదని ముద్రగడ స్పష్ట చేసారు.












Click it and Unblock the Notifications