మీ ఆధార్ నెంబర్‌తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా?: ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ వ్యవహారాలు నడిపే వారంతా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త కొత్త సాంకేతికతతో ఆన్‌లైన్ వ్యవహారాలు జరిపే వారిని దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వ్యక్తిగత వివరాలను సేకరించి మన పేరుతోనే మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు.
మన ఆధార్ నెంబర్‌తో సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకుని ఈ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల విజయవాడలోని ఓ వ్యక్తి ఆధార్ కార్డుతో ఏకంగా 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉండటం గమనార్హం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దాన్ని గుర్తించిన టెలికాం అధికారులు వాటన్నింటినీ బ్లాక్ చేశారు. ఇలా ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే టెలికాం శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. ఒక ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులు తీసుకునేందుకు మాత్రమే అనుమతించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ-వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో మరో ప్రత్యేక ఏర్పాటును చేసింది.
ప్రతి ఒక్కరూ.. తమ ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ఒక వైబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. దీని ద్వారా ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్లు అనుసంధానమై ఉన్నాయో చెప్పడమే కాకుండా.. మొబైల్‌ను ఎవరైనా చోరీ చేసినా.. పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునేలా అవకాశం కల్పించారు.
ఒక ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడం ఎలా?
మొదట https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో 'బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్', know your mobile connecton(https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
రెండో ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. వినియోగదారుడి 10 అంకెల మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలని అడుగుతుంది.
ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ(OTP) ఎంటర్ చేస్తే.. ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నెంబర్ల జాబితా చూపిస్తుంది.
ఇందులో ఏదైనా నెంబర్ మీది కాకపోయినా.. ప్రస్తుతం వినియోగించకపోయినా.. దాన్ని బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. వినియోగదారులు వెంటనే ఈ సదుపాయాన్ని వినియోగించి తమ ఆధార్‌పై ఉన్న సిమ్ కార్డుల వివరాలను తెలుసుకోవచ్చు.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?










Click it and Unblock the Notifications