హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ట్రీట్ ఫైట్‌ ట్విస్ట్: కామన్ గర్ల్ ఫ్రెండే హత్యకు కారణమా? (వీడియో )

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో జరిగిన స్ట్రీట్ ఫైట్ హత్య సంఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారమే నబిల్ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కామన్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో జరిగిన గొడవలే చివరకు హత్యకు దారి తీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అబూ బకర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ప్రేయసి విషయంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని నబిల్‌ను చంపేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుస్తీ పోటీలో నబిల్ గెలిచిన తర్వాత పిడిగుద్దులు గుద్దడం, అంతకు ముందు అబూబకర్‌తో అబేజ్ అహ్మద్‌ చెవిలో గుసగుసలు పెట్టడం ఆ అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు.

నిజానికి వారంతా మంచి మిత్రులని తెలుస్తోంది. ప్రేయసి విషయంలో వారి మధ్య అంతకు ముందు కూడా పలుమార్లు గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ప్రేయసి కోణంపై దర్యాప్తు చేస్తూ పోలీసులు వారి ఫోన్ నెంబర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నబిల్ మృతదేహానికి సోమవారం పోస్టు మార్టం నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ స్ట్రీట్‌ఫైట్‌లో గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా నబిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. స్ట్రీట్‌ఫైట్‌ను దాచిపెట్టి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించేందుకు నబిల్ స్నేహితులు యత్నించారు.

అయితే నబిల్ మరణానికి అసలు కారణం స్ట్రీట్ ఫైట్ జరిగిన సమయంలో తీసిన మొబైల్ వీడియో ద్వారా పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. బెట్టింగ్‌లో భాగంగానే స్ట్రీట్‌ ఫైట్ జరిగినట్లు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అయితే, ప్రేయసి కోణం కూడా తాజాగా వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని సత్యనారాయణ చెప్పారు.

Murder in street fight: Love affair?

నబిల్‌ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతానికి నబిల్‌ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటన జరిగింది మే 3న అయితే తమకు ఫిర్యాదు అందింది మాత్రం ఏడవ తేదీన అని తెలిపారు.మీర్‌చోక్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ దస్తగీర్ కుమారుడు నబీల్ అహ్మద్ (17) ఫలక్‌నూమలోని ప్రెసిడెన్సీ జూనియర్ కళాశాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓవైస్ పటేల్ (19) నబీల్‌ను ముష్టిఘాతాలతో చితకబాదాడు.

కేసులో మొత్తం 8మంది ఉన్నట్టు తేలింది. ఓవైస్ పటేల్ సహా ఉమార్‌బేగ్ (20), సుల్తాన్‌మీర్జా (21), ఇర్ఫాన్ పటాన్ (20), షాబాస్ (20), అబూబాకార్ (19), ఓబైద్ (19)తోపాటు మరో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
A boy Nabil killed in a street fight at Meer Chowk in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X