వర్మ సహనానికి 'మెగా' పరీక్ష - నాగబాబు తాజా నిర్ణయం వెనుక..!!

పిఠాపురంలో ఏం జరుగుతోంది. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతు దారుల కు నచ్చలేదు. పిఠాపురం పైన పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు తీసుకున్న తాజా నిర్ణయం వర్మ క్యాంపులో చర్చగా మారుతోంది.

మెగా రాజకీయం
పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత క్రమేణా వర్మ - జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వర్మ కు నాడ ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కాలేదు. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమ పడితే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పైన తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన నిలదీసి న కార్యకర్తలు.. వర్మ చెబితేనే పవన్ కు ఓటు వేసామని తేల్చి చెప్పారు.

nagababu-latest-pithapuram-tour-leads-to-new-equations-in-pithapuram

నాగబాబు పర్యటనతో
వర్మ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వర్మ మాత్రం తనకు నియోజకవర్గానికి సేవ చేయటం ముఖ్యమని చెబుతూ.. తన పని తాను చేసుకుపోతున్నారు. ఇక, వర్మకు ఎమ్మెల్సీ పదవి హామీ అమలు కాక ముందే పవన్ సోదరుడు నాగబాబు..అదే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వస్తున్నారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

Take a Poll

వర్మ వాట్ నెక్స్ట్
నాగబాబుకు త్వరలో మంత్రి పదవి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇప్పుడు పిఠాపురం లో నాగబాబు ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా, ఈ కార్యక్రమాల్లో వర్మను సైతం కలుపుకొని వెళ్తారా.. ఆహ్వానిస్తే కలిసి వెళ్లేందుకు వర్మ సిద్దంగా ఉన్నారా అనేది నియోజకవర్గంలో చర్చగా మారింది. నాగబాబు పార్టీ సభలో చేసిన వ్యాఖ్యల తరువాత ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల పైన రెండు వైపులా స్పందన లేదు. సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ పోస్టింగ్స్ కనిపించాయి. ఇక, ఇప్పుడు పిఠాపురంలో రెండు రోజుల నాగబాబు పర్యటనతో చోటు చేసుకునే పరిణామాల పై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+