Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి రోజా ఒంటరిపోరాటం, ఓడిస్తామని సొంత పార్టీ నాయకుల చాలెంజ్, జగన్ రాజీ ప్రయత్నం !

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ సీట్లు సంపాధించుకుని అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జేనసేన, బీజేపీలు ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. మరోసారి అధికారం మాదే అని వైసీపీ ధీమాగా ఉంది

అయితే ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజక వర్గాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని వెలుగు చూసింది. ముఖ్యంగా ప్రతిపక్షాలను విమర్శించడంలో ముందు వరుసలో ఉంటూ నోటిదురుసుతో వాళ్లను నోటికి వచ్చినట్లు విమర్శించిన నాయకులకు ఇప్పుడు బలంగా ఎదురుదెబ్బ తగులుతోందని వెలుగు చూస్తోంది. అలాంటి నాయకుల్లో ముందు వరుసలో ఉండే నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు ఇప్పుడు స్థానిక వైసీపీ నాయకులు సినిమా చూపిస్తున్నారు.

నగిరిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా తరువాత మంత్రి పదవి దక్కించుకున్నారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన తరువాత రోజా తీరులో మార్పు వచ్చిందని చాలా కాలం నుంచి నగిరి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే విషయంలో జగన్ సీఎం అయిన తరువాత మొదటి విడతలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. తరువాత పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకు వచ్చిన రోజా రెండో విడతలో మంత్రి పదవికి దక్కించుకున్నారని నగిరి వైసీపీ నాయకులు, ప్రజలు అంటున్నారు.

రోజా మంత్రి అయిన తరువాత నగిరిలోని వైసీపీ నాయకులను పూర్తిగా పక్కనపెట్టేశారని, నగిరి నియోజక వర్గంలో ఏ టూ జడ్ పంచాయితీలను ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డితో పాటు ఆమె బంధువులు కలిసి నగిరిలో కబ్జాలు, సెటిల్ మెంట్లు, పంచాయితీలు చేసి భారీ మొత్తంలో సంపాధించారని ఆ నియోజక వర్గంలోని వైసీపీ నాయకులే ఆరోపించారు.

తనకు మునిసిపల్ చైర్మన్ పదవి ఇస్తామని నమ్మించి రూ 40 లక్షలు తీసుకుని మోసం చేశారని వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి బహిరంగంగా ప్రెస్ క్లబ్ లో మంత్రి రోజాతో పాటు ఆమె సోదరుడి మీద సంచలన ఆరోపణలు చేశారు. ఇంత జరిగినా రోజా మాత్రం వైసీపీ నాయకులను పట్టించుకోకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ వెలుతున్నారు. ఇటీవల నగిరిలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ కౌన్సిలర్, రోజా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసిన భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు.

Nagiri senior YCP leaders working against Minister Roja
నగిరి నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో ఎంతో పేరు ఉన్న వైసీపీ నాయకులు రోజాకు పని చెయ్యమని తేల్చిచెప్పారు. జగనన్న ముదు రోజా వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. నరిగిలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా గళంవిప్పిన వైసీపీ నాయకులు, అడ్డం తిరిగిన సీనియర్ లీడర్ కేజీ శాంతి, రోజాల చేతులు కలిపిన సీఎం జగన్ ఇద్దరు కలిసి పార్టీ కోసం పనిచెయ్యాలని స్వయంగా రాజీ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

మంత్రి రోజా కోసం తాను పని చెయ్యనని కేజీ శాంతి తేల్చి చెప్పారు. తనకు చైర్మన్ పదవి ఇస్తామని నమ్మించిన రోజా కుటుంబ సభ్యులు తన దగ్గర రూ 40 లక్షలు లంచం తీసుకున్నారని వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి పదేపదే బహిరంగంగా ఆరోపించినా రోజా ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మీద ఆరోపణలు చెయ్యడంతో నగిరి వైసీపీ నాయకులు మండిపోతున్నారు. నగిరిలో వైసీపీ నాయకులు పోతేపోతారని, వాళ్లు పార్టీలో ఉంటే తనకు 500 మెజారిటీ వస్తుందని, వాళ్లు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతే 25 వేల నుంచి 30 వేల మెజారిటీ వస్తుందని రెండు రోజుల క్రితం మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు,

Nagiri senior YCP leaders working against Minister Roja

రోజా వ్యాఖ్యలతో నగిరి వైసీపీ నాయకులు తాడేపల్లిగూడంలోని సీఎంవో ఆఫీసుకు వెళ్లి మంత్రి రోజా విజయానికి తాము పని చెయ్యలేమని తేల్చి చెప్పారని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. నగరికి చెందిన శ్రీశైలం దేవాలయం ట్రస్టు బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతి రాజు, ఏళుమలై, రెడ్డి వారి భాస్కర్ రెడ్డి తదితరులు సజ్జల రామక్రిష్ణారెడ్డిని కలిసి మేము రోజాకు మద్దతు ఇవ్వమని, ఆమె కోసం పని చెయ్యమని తేల్చి చెప్పారని తెలిసింది.

నగిరి వైసీపీ నాయకుల మాటలను ఓపిగా విన్న సజ్జల ఈ ఒక్కసారికి రోజా కోసం పని చెయ్యాలని, తరువాత ఆమెకు సర్ది చెబుతామని నగిరి వైసీపీ నాయకులకు నచ్చచెప్పారని, అందుకు నగిరి వైసీపీ నాయకులు అంగీకరించలేదని తెలిసింది. నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోని వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి రోజా కోసం తాము పని చెయ్యమని తేల్చి చెప్పడంతో రోజా మరోసారి ఎమ్మెల్యే కావాలని ఒంటరిపోరాటం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+