నాగుల చవితి పూజ ముహూర్తం, పుట్ట పూజ ఇలా :సంతాన ప్రాప్తి కోసం..!!

నాగుల చవితి. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. కార్తిక మాసంలో నాగుల చవితి జరుపుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. రేపు (శనివారం) కార్తిక శుద్ధ చవితి సందర్భంగా ఈ రోజు నాగుల చవితి పండుగగా పంచాంగ కర్తలు నిర్ణయించారు. ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పూజకు సుముహూర్తంగా నిర్దారించారు. కాగా.. పుట్ట పూజతో పాటుగా ఈ రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

నాగుల చవితి నాడు భక్తి శ్రద్దలతో నాగు పామును నాగ రాజుగా, నాగ దేవతగా పూజిస్తారు. నాగుల చవితి రోజు నాగులను పూజించడం వలన కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం వంటి దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఇంట్లో సుబ్రహ్మణ్యస్వామికి పిండి దీపం పెట్టుకోవడం ఆనవాయితీ ఉన్నవారు ఆచరించడం మంచిదని సూచిస్తున్నారు. నాగుల చవితి విశిష్టత అంతా పుట్టలో పాలు పోయడంలోనే ఉంది. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలో లేదా ఊరి బయట ఉన్న పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం. అనంతరం పుట్టనే సుబ్రహ్మణ్యస్వామిగా భావించి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు.

nagula-chavithi-2025-time-puja-rituals-and-significance

ఆ తరువాత పుట్టకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఇక.. నాగుల చవితి వ్రతం చేసేవారు ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ఈ రోజు ఉడికించినవి, వండినవి, వేడి చేసిన పదార్ధాలు తీసుకోకూడదు. కేవలం, పండ్లు, చలిమిడి, కొబ్బరినీళ్లు, పళ్లరసాలు, వంటివి మాత్రమే తీసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఉపవాసం చేసే వారు పగలు నిద్ర పోకూడదు. మరుసటి రోజు అంటే అక్టోబర్ 26, ఆదివారం రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి తిరిగి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నమస్కరించుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమణ చేయాలని సూచిస్తున్నారు. సనాతన సంప్రదాయాలు పాటించే వారు నాగుల చవితి రోజు కూరగాయలు గాని పండ్లు గాని కోయకూడదని చెబుతున్నారు. ఈ రోజున సంతానం లేని దంపతులు నాగదేవతను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అదే విధంగా నాగదోషం, రాహు తు దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+