వారసుడి ఎంట్రీకి బాలయ్య పక్కా ప్లాన్
అభిమానులు ఎదురుచూస్తున్న కొద్దీ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా పూరీ జగన్నాథ్ పేరు వినిపించింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను పేరు బయటకు వచ్చింది. అయితే ఫలానా సమయంలో ఫలానా సినిమాద్వారా పరిచయం చేయబోతున్నామనే స్పష్టమైన విషయం మాత్రం బయటకు రావడంలేదు.
అమెరికాలో తెలుగువారి వేడుకలకు ఇటీవలే అక్కడకు వెళ్లిన బాలకృష్ణ అభిమానుల ఒత్తిడి మేరకు కొన్ని వివరాలు తెలియజేసినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం తన దర్శకత్వంలోనే ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ ప్రారంభిస్తామని, అందులో తనతోపాటు తన కుమారుడు మోక్షజ్ఞకి కూడా సమానమైన పాత్ర ఉంటుందని చెప్పారంట. అయితే హీరోగా పరిచేయాలికానీ ఇలా ఇంకొకరితో పాత్రను పంచుకోవడం ఏమిటనే సందేహం అందరికీ వచ్చింది. అయితే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తొలిసారిగా తాతమ్మకల చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి ఎన్టీఆరే దర్శకుడు. ఆ సెంటిమెంట్ వర్కౌటై క్రమంగా బాలకృష్ణ అగ్ర కథానాయకుడిగా మారారు. కెరీర్ తొలిరోజుల్లేనే బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో కొన్ని సినిమాలను చేశారు. ఇక్కడ కూడా అది రిపీట్ చేయాలని భావిస్తున్నారు. తన దర్శకత్వంలో తన కుమారుడి మొదటి సినిమా ఉండాలని, తర్వాత అంతా కలిసివస్తుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మోక్షజ్ఞని 2025లోనే స్క్రీన్ మీద చూసేదని స్పష్టత వస్తోంది. ఆదిత్య 999కు కథ సిద్ధంగానే ఉందని, మొదటి పార్ట్ తీసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకొని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిని బాలకృష్ణ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications