నందమూరి కుటుంబానికి శాపంగా మారిన 'కారు'!
నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ 2014, డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లాలోనే కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
నందమూరి తారకరామారావు కుమారుడు, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. అయినప్పటికీ స్వల్పగాయాలతో రామకృష్ణ బయటపడ్డారంటే అదృష్టమేనని సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూసినవారు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 10లో ఆయన స్వయంగా నడుపుకొంటూ వెళుతుండగా అదపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రామకృష్ణ సిబ్బంది వచ్చి కారును తీసుకువెళ్లారు.
రామకృష్ణ సోదరుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న గత నెల 27వ తేదీన లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడే గుండెపోటు రావడంతో అప్పటి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నందమూరి కుటుంబానికి కారు ప్రమాదాలు శాపంగా మారిన్నట్లున్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, బాలకృష్ణ సోదరుడైన నందమూరి హరికృష్ణ 2018, ఆగస్టు 29న నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా నందమూరి అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది.

నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ 2014, డిసెంబర్ 6వ తేదీన నల్గొండ జిల్లాలోనే కోదాడ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటన జరిగిన నాలుగు సంవత్సరాలకే హరికృష్ణ కూడా అదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో 2009లో ఖమ్మంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా నందమూరి రామకృష్ణ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.












Click it and Unblock the Notifications