నా భర్త కోసం మద్దతు కోరాను,అండగా నిలవండి - నారా భువనేశ్వరి..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు జనసేనాని, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సీబీఐ నేతలు అరెస్ట్ ను తప్పు బట్టారు. వైసీపీ నేతలు స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే భువనేశ్వరి స్పందించారు.

భువనేశ్వరి స్పందన: చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి భువనేశ్వరి దర్శించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించారు. ఇటువంటి సమయంలో ధైర్యం ఇవ్వాలని..అమ్మవారి ఆశీర్వాదం..మద్దతు కోరానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

Nara Bhuvaneswari becomes emotional on Chandra Babu Arrest, seek public support

ఏపీ ప్రజల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని వివరించారు. ప్రజల కోసం చంద్రబాబు సాగిస్తున్న ప్రయాణం దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు చేయి చయి కలిపి మద్దతుగా నిలవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది ఏంటో గుర్తించాలని సూచించారు.

రామకృష్ణ ఎమోషనల్: చంద్రబాబు అరెస్ట్ పైన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబును పాత కేసులో అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. ఇదంతా ప్రభుత్వం కుట్రగా ఆరోపించారు. ఆయన ఏపీ ప్రజలకు సేవ చేసారని .. ప్రతీ సందర్భంలోనూ రాష్ట్రం కోసమే పని చేసారని వివరించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.

Nara Bhuvaneswari becomes emotional on Chandra Babu Arrest, seek public support

ఈ సమయంలో చంద్రబాబు పైన ఉద్దేశ పూర్వకంగా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోదరి పడుతున్న ఆవేదన తనకు మరింత బాధ కలిగిస్తోందన్నారు. విజయవాడకు చంద్రబాబు చేరుకున్న తరువాత భువనేశ్వరి కలిసే అవకాశం ఉంది. అటు నారా లోకేశ్ తన యువగళం యాత్ర నుంచి విజయవాడకు బయల్దేరారు.

Nara Bhuvaneswari becomes emotional on Chandra Babu Arrest, seek public support

చంద్రబాబుకు మద్దతుగా: ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన వైసీపీ నేతలు మద్దతుగా మట్లాడుతున్నారు. అటు టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం పైన ఇప్పటికే సీఐడీ అధికారులు తాము పూర్తి ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

నందమూరి బాలయ్య ఈ అరెస్ట్ పైన ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు చేసారు. జనసేనాని పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. దీంతో, విజయవాడకు చంద్రబాబు చేరుకున్న తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చే అవకాశం ఉంది. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు అరెస్టును ఇప్పటికే టీడీపీ నేతలు ఖండించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దుర్గమ్మ ఆలయానికి వచ్చిన సమయంలో విజయవాడ టీడీపీ నేతలు కేశినేని చిన్నితో పాటు ఇతర నేతలు ఉన్నారు. భువనేశ్వరికి ధైర్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+