Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూ డిసర్వ్ ఇట్ భువనమ్మ... ఆనందంలో సీఎం చంద్రబాబు !

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) నుంచి ఆమెకు 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఆమె చూపిన విశిష్ట నాయకత్, సామాజిక సేవకు గాను ఈ అవార్డు లభించింది.

ఈ మేరకు కార్పొరేట్ గవర్నెన్స్‌లో గోల్డెన్ పీకాక్ నారా భువనేశ్వరి ఈ కార్యక్రమంలో రెండు ముఖ్యమైన గౌరవాలను అందుకున్నారు. విశిష్ట వ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆమెను 'విశిష్ట వ్యక్తి'గా గుర్తించి ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌ను అందించింది. అలానే 'ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్' విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె స్వీకరించారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్‌లో ఆమె సమర్థవంతమైన నిర్వహణ మరియు పారదర్శక పాలనకు నిదర్శనం.

nara-bhuvaneswari-received-rare-honor-from-institute-of-directors-at-london

అనంతరం ఐఓడీ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో నారా భువనేశ్వరి భువనేశ్వరి.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తాము అందిస్తున్న విస్తృత సేవలను వివరించారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ట్రస్ట్ యొక్క ప్రధాన ఆశయమని ఆమె పేర్కొన్నారు. అందుకే అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేందుకు అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నామని.. వారికి కూడా సమానస్థాయి వచ్చేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు.

కాగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక ముఖ్యమైన రంగాలపై దృష్టి సారించిందని స్పస్టం చేశారు. ట్రస్ట్ తరపున సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. వాటి ద్వారా నిరుపేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అలానే ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలను కూడా ట్రస్ట్ చేపడుతోందన్నారు.

మరోవైపు మహిళా సాధికారిత కోసం నారా భువనేశ్వరి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ సేవలను అందిస్తోంది. ప్రకృతి విపత్తులు (Natural Calamities) సంభవించినప్పుడు, బాధితులకు తక్షణ సహాయం అందించి, వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ చేయూత అందిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+