రెండుసార్లు అదే ఫ్యామిలీ ప్రతిపాదన, 29 ఏళ్లలో చంద్రబాబు రికార్డు ఇదే, ఎన్టీఆర్ అల్లుడు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైనారు. చంద్రబాబు నాయుడు ఓ అరుదైన రికార్డుకు సృష్టించారు.
1995లో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్బంలో నారా చంద్రబాబు నాయుడిని టీడీపీ శాసనసభా పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు పేరును ఆయన తోడల్లుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎన్టీఆర్ కుమార్తె పురేందేశ్వరి భర్త. ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటు వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడు ఆ సందర్బంలో టీడీపీలో చక్రం తిప్పారు.

తరువాత చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయ్యారు. ఆ తరువాత మరో రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడి పేరును పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిపాదించారు.
1995లో చంద్రబాబు పేరును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ప్రతిపాదించారు. సరిగ్గా 29 ఏళ్ల తరువాత అదే చంద్రబాబును సీఎంగా ఆయన వదిన దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిపాదించారు. దంపతులు ఇద్దరు చంద్రబాబు నాయుడి పేరును 29 ఏళ్లలో రెండు సార్లు సీఎంగా ప్రతిపాదించడంతో చంద్రబాబు రికార్డు సృష్టించారు.మొత్తం మీద నారా కుటుంబం, దగ్గుబాటి కుటుంబ ఇప్పుడు ఒక్కటి కావడంతో రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయని వారి సన్నిహితులు అంటున్నారు.












Click it and Unblock the Notifications