మూడు ముక్కలాటతో సగం చచ్చిన వైసీపీ.. చంద్రబాబుపై దాడితో పూర్తిగా చచ్చింది: లోకేశ్ ఫైర్

వైసీపీ సర్కార్‌పై నారా లోకేశ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. విశాఖపట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు. కోడి గుడ్లు, టమాటోలతో దాడులు చేయించడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను విశాఖకు ఎందుకు రానీయడం లేదు అని ప్రశ్నించారు. రాజధానులపై వైసీపీ ప్రభుత్వం భయపడుతోందా అని అడిగారు. ఈ మేరకు నారా లోకేశ్ వరస ట్వీట్లతో విమర్శలు చేశారు.

మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అమరావతి ప్రజల గోస పోసుకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. మూడు ముక్కలాట ప్రారంభించి సగం చచ్చారు అని రాజధానులపై ఘాటు ట్విట్‌తో విమర్శలు ప్రారంభించారు. ప్రతిపక్ష నేత యాత్రను అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చిపోయారని విమర్శించారు. వైసీపీ డీఎన్ఏలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం విశాఖపట్టణంలో చేసిన దాడులతో బయటపడిందని మండిపడ్డారు.

nara lokesh angry on chandrababu naidu attack..

విశాఖపట్టణంలో అడుగుపెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో గురువారం వైసీపీ ట్రైలర్ ద్వారా చూపించిందని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతపై గుడ్డు, టమాటోలు వేసిన వారు.. రేపు బాంబులు, కత్తులతో దాడికి దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు రౌడీ బ్యాచ్ అంటూ ఘాటు ట్వీట్లు చేశారు. ఇది రాయలసీమ ప్రజలకు తెలుసని.. విశాఖ దాడితో ప్రజలందిరీకి తెలిసిందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+