'డిప్యూటీ సీఎం' పై తేల్చేసిన లోకేష్ - పవన్ వాట్ నెక్స్ట్..!!
ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమి లో రచ్చగా మారింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు చేసిన ప్రతిపాదన వివాదానికి కారణమైంది. పవన్ మద్దతు దారులు ఈ ప్రతిపాదన ను వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగింది. ఈ సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు ఈ అంశం పైన స్పందిచవద్దని స్పష్టం చేసాయి. కాగా, డిప్యూటీ సీఎం పదవి పై లోకేష్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
డిప్యూటీ సీఎం పదవి పై
ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో ప్రస్తుతానికి ముగిసినట్లే కనిపిస్తోంది. లోకేష్ కు డిప్యూ టీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేసారు. చంద్రబాబు సమక్షం లోనే ఈ డిమాండ్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి చేయటంతో.. మిగిలిన నేతలు ఇందులో పోటీ పడ్డారు. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సమయంలో అందుకు సమానం గా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది టీడీపీ నేతల వాదన. అయితే, కూటమి ఒప్పందం లో భాగంగా డిప్యూటీ సీఎం పదవి పవన్ కు మాత్రమే కొనసాగాలనేది జనసేన నేతలు గుర్తు చేస్తు న్నారు. ఈ క్రమంలోనే కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు.

పవన్ ను సీఎం చేయాలి
లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ కేడర్ కోరుకోవటంలో తప్పు లేదని చెబుతున్న జనసేన నేతలు అదే సమయంలో పవన్ ను సీఎంగా చూడాలనేది తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. దీంతో, ఈ వివాదం పీక్ కు వెళ్తున్నట్లుగా గుర్తించిన టీడీపీ నాయకత్వం ఎవరూ ఈ అంశం పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. కాగా, జనసేన సైతం ఇదే తరహాలోనే పార్టీ కేడర్ కు స్పష్టత ఇచ్చింది. డిప్యూటీ సీఎం పదవి పైన ఎవరూ ఎలాంటి కామెంట్స్ చేయవద్దంటూ పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ సమయంలోనే దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఈ అంశం పైన స్పందించారు.
తేల్చేసిన లోకేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు తన పై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారని లోకేష్ చెప్పుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు నమ్మకాన్ని..ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తు న్నానని వివరించారు. ఇతర ఆలోచనలకు తావు లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగు లేని మెజార్టీ ఇచ్చారని.. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభు త్వం సాగిపోతోందని లోకేష్ స్పష్టం చేసారు. దీంతో, ప్రస్తుతానికి ఈ వివాదం సమిసిపోయినట్లుగా భావిస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications