ఆ చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న లోకేష్..! ఇవాళ్టికి మూడేళ్లు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఘటనల్లో కొన్నింటిని అధికార టీడీపీ, పార్టీ నేతలు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి వాటిలో స్కిల్ స్కాంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును (Chandrababu) నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి, రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపడం, అక్కడ ఆయన బెయిల్ కూడా లేక 53 రోజుల పాటు గడపడం అందులో ప్రధానమైనది. ఈ ఘటన జరిగి ఇవాళ్టికి మూడేళ్లు. దీంతో మంత్రి నారా లోకేష్ దీన్ని గుర్తుచేసుకున్నారు.
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం చంద్రబాబు గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే అంటూ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిందని ఆయన తెలిపారు. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు, అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి అని గుర్తుచేసుకున్నారు. నిజం గెలిచింది, నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

#NijamGelichindi
— Lokesh Nara (@naralokesh) September 9, 2026
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు… pic.twitter.com/2tgntuAX4V
అప్పట్లో స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత రాజమండ్రికి హుటాహుటిన అక్కడికి వెళ్లిన నారా లోకేష్.. తండ్రిని కలిశారు. అనంతరం పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి రాష్ట్రంలో పరిణామామాల్ని వివరించారు. అలాగే కోర్టుల్లోనూ చంద్రబాబుకు అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. లాయర్లను సమన్వయం చేసుకుంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. దీంతో చివరికి 53 రోజుల తర్వాత చంద్రబాబు బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక మార్పులకు దారి తీసింది. ఆ తర్వాత వైసీపీ అధికారం కోల్పోవడం, కూటమి భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగాయి.














Click it and Unblock the Notifications
