జగన్ కూతురుపై నారా లోకేష్ సంచలన కామెంట్స్..ఆ గాడిదలనే అడగండీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ కుటుంబంపై సంచలన కామెంట్స్ చేశారు. రెండు రోజుల క్రితం నారా లోకేష్‌ను US పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ముఖ్యంగా నారా లోకేష్ అరెస్ట్ అయ్యారనే వార్త వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎన్నికల ఫండింగ్ కోసం అమెరికా వెళ్లిన నారా లోకేష్ అక్కడ పోలీసులకు దొరికిపోయారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది.
అమెరికాలో అరెస్టు ప్రచారంపై స్పందించిన లోకేష్..!!!#NaraLokesh #TDP #Oneindiatelugu pic.twitter.com/oIkPXTJxmr
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2024
కొన్ని ప్రముఖ వైబ్‌సైట్లు సైతం నారా లోకేష్ అరెస్ట్ గురించి రాయడంతో ఇది నిజమే అని కొందరు భావించారు. తాజాగా దీనిపై నారా లోకేష్ తనదైనశైలిలో స్పందించారు. NRIల మద్దతుతో పాటు, పార్టీ కార్యకలాపాల నిధుల సేకరించడం కోసం అమెరికా వెళ్లానని ఆయన తెలిపారు. US పోలీసులు అరెస్ట్ చేశారని వస్తోన్న వార్తలపై మీడియా లోకేష్‌ను ప్రశ్నించగా ఆయన ఘాటుగా స్పందించారు.

అరెస్ట్ చేసింది ఎవర్నీ జగన్ నా ..? లేదా జగన్ కూతురినా ..? లేదా భారతీ రెడ్డినా అంటూ సీఎం కుటుంబాన్ని లోకేష్ ఎద్దెవా చేశారు. మిమ్మల్ని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందంటూ మీడియా ప్రతినిధి నారా లోకేష్‌ను ప్రశ్నించగా .. అయితే ఆ గాడిదలనే అడగండీ అంటూ అక్కడ నుంచి ఆయన వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications