నారా లోకేష్ గెలుపు ఖాయం - అన్నింటికీ అదే సమాధానం..!!
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ గెలుపు పైన ఆసక్తి నెలకొంది. మంగళగిరి నుంచి 2019లో పోటీ చేసి ఓడిన లోకేష్ ఈ సారి గెలుపు కోసం తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంతో మమేకం అయ్యారు. తాను ఓడిన చోటే గెలిచి అసెంబ్లీకి వస్తానని..మంగళగిరిలో గెలిచి తన తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మంగళగిరి నుంచి లోకేష్ గెలుస్తారనే అంచనాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

లోకేష్ గెలుస్తున్నారంటూ
మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆరా సంస్థ లోకేష్ గెలుపు ఖాయమని వెల్లడించింది. ఇక్కడ 2019 లో లోకేష్ వైసీపీ అభ్యర్ది ఆర్కే చేతిలో ఓడిపోయారు. ఈ సారి మంగళగిరిలో జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. బీసీ నియోజకవర్గంలో చేనేన వర్గానికి చెందిన గంజి చిరంజీవిని తొలుత అభ్యర్దిగా ప్రకటించారు. ఆ తరువాత మురుగుడు లావణ్యను ఖరారు చేసారు. హోరా హోరీగా ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి జగన్ సైతం మంగళగిరిలో ప్రచార సభల్లో పాల్గొన్నారు.

వైసీపీ వర్సస్ టీడీపీ
ఇక్కడ గెలుపు కోసం లోకేష్ 2019లో ఓటమి నాటి నుంచి వ్యూహాలు అమలు చేసారు. అన్ని గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం పలు మార్లు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ తరపున ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీతో పొత్తు కూడా లోకేష్ కు కలిసి వచ్చింది. వైసీపీ తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయనే నమ్మకంతో ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ వీడి కాంగ్రెస్ లో చేరినా..తిరిగి ఎన్నికల సమయానికి వైసీపీలో రీ ఎంట్రీ ఇచ్చారు. లావణ్య గెలుపు కోసం పని చేసారు.
2019 నుంచే లోకేష్ అడుగులు
తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మంగళగిరి నుంచి లోకేష్ విజయం సాధిస్తారని ఆరా సంస్థ వెల్లడించింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత నాటి చంద్రబాబు హాయంలో లోకేష్ మంత్రిగా పని చేసారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఛాన్స్ లేకపోవటంతో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సందర్భాల్లో లోకేష్ ఓటమి పైన ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసారు. ఎలాగైనా ఈ సారి గెలుపే లక్ష్యంగా పని చేసారు. అయితే, వైసీపీ నేతలు మాత్రంమంగళగిరిలో గెలవబోతున్నామని ఇప్పటికీ చెబుతున్నారు. దీంతో..జూన్ 4న తుది ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications