మంగళగిరిలో రికార్డులు బద్దలు కొట్టిన నారా లోకేష్.. 39ఏళ్ళ చరిత్రలో తొలిసారి టీడీపీకి పట్టం!!
AP assembly election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ సీట్ గా భావించిన మరొక స్థానం మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం లో లోకేష్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్, నాటి ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమార్లు అవమానాలను ఎదుర్కొన్నారు.
మంగళగిరిలో లోకేష్ విజయం
ఇక ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా మంగళగిరి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ చేసిన నారా లోకేష్ ఇప్పుడు మంగళగిరిలో విజయం సాధించారు. మంగళగిరిలో తన సమీప ప్రత్యర్థి అయిన కాండ్రు లావణ్య పై లోకేష్ గెలుపొందారు. మంగళగిరిలో నారా లోకేష్ 36వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. దీంతో టిడిపి శ్రేణులు మంగళగిరి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

39 ఏళ్ల చరిత్రలో మొదటిసారి మంగళగిరిలో టీడీపీ విజయం
మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి తెలుగుదేశం విజయం సాధించింది. 39 ఏళ్ల మంగళగిరి చరిత్రలో మొదటిసారి టిడిపి మంగళగిరిలో విజయం సాధించింది. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చేసిన పలు కార్యక్రమాలు ఆయనకు మంగళగిరి ప్రజల మద్దతును తెచ్చిపెట్టాయి. మంగళగిరి నియోజకవర్గంలో తరచూ పర్యటించిన నారా లోకేష్ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి చేయవలసిన దాన్ని కూడా అర్థం చేసుకొని అధికారంలో లేనప్పటికీ తదనుగుణంగా అడుగులు వేశారు.
నారా లోకేష్ కు కలిసొచ్చిన అంశాలివే
ఈ క్రమంలో మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని అమరావతి ప్రాంతం ఉండడం, ఇక్కడి ప్రజలు పెద్ద ఎత్తున జగన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా నారా లోకేష్ విజయానికి కారణంగా చెప్పొచ్చు. నారా లోకేష్ గత ఐదేళ్లుగా సిన్సియర్ గా నియోజకవర్గం కోసం చేసినటువంటి కృషి ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనిపించింది.
బ్రాహ్మణి ప్రచారం కూడా లోకేష్ కు ప్లస్
ఇక మరోవైపు ఈసారి నారా బ్రాహ్మణి లోకేష్ కోసం ప్రచారం నిర్వహించడం, లోకేష్ ఆలోచనలను ప్రజలకు వివరించడం, ఇక్కడ స్త్రీ శక్తి కేంద్రం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చి అండగా ఉండటం కూడా ఇక్కడ లోకేష్ కు కలిసి వచ్చేలా చేసింది. మంగళగిరి నియోజకవర్గ ప్రగతికి తన వంతుగా ఏం చేస్తానో చెప్పిన లోకేష్ ఇక్కడ ప్రజల మద్దతును పొందడంలో 100% సక్సెస్ అయ్యారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications