నరసాపురం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! తిరుపతిలో హాల్ట్..!

ఈ వేసవిలో ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి తిరుపతికి, బెంగళూరుకు ప్రయాణాలు చేసే వారికి దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో వేసవి రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా నాలుగు రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు వాటికి తిరుపతిలో అదనపు హాల్ట్ కూడా ఇచ్చింది. దీంతో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఇలా పొడిగించిన రైళ్లు, వాటి సమయాలు, ఇతర వివరాలను ఓసారి చూద్దాం..

 Kakinada - Lingampalli: కాకినాడ-లింగంపల్లి ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రేపటి నుంచే..!
Kakinada - Lingampalli: కాకినాడ-లింగంపల్లి ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రేపటి నుంచే..!

నరసాపురం- బెంగళూరు (narasapur to Bengaluru) స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ఈ రూట్ లో నాలుగు రైళ్లను పొడిగించారు. నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు జూన్ 5, 12, 19 తేదీల్లో నడిచేలా ఓ రైలు 07153ని అందుబాటులోకి తెచ్చారు. ఇది రేణిగుంట-పాకాల-చిత్తూరు-కాట్పడి-జోలార్ పెట్టై మీదుగా ప్రయాణించనుంది. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి నరసాపురానికి జూన్ 6, 13, 20 తేదీల్లో మరో రైలు నంబర్ 07154ను అందుబాటులోకి తెచ్చారు. ఇది కూడా రేణిగుంట-జోలార్ పెట్టై రూట్ లోనే వెళ్తుంది.

Narasapur to Bengaluru Just Got Easier SCR Extends Trains for Summer Rush
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

అలాగే జూన్ 26వ తేదీ నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు మరో రైలు 07153 జూన్ 26న నడపనున్నారు. ఈ రైలు మాత్రం సాధారణ రూట్ అంటే రేణిగుంట నుంచి మేల్పక్కం, కాట్పడి, జోలార్ పెట్టై లో ప్రయాణిస్తుంది. అలాగే జూన్ 27న ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి నరసాపురానికి జూన్ 27న మరో రైలు 07154 ను నడపనున్నారు. ఇది కూడా సాధారణ రూట్ లోనే ప్రయాణిస్తుంది. ఈ నాలుగు రైళ్లకూ తిరుపతిలో అదనంగా హాల్ట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+