వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాన్ని తగులబెట్టి డిన్నర్లా: మంత్రులపై నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana deplores ministers attitude
హైదరాబాద్: ఓ వైపు రాష్ట్రం తగులబడుతుంటే కోస్తా, తెలంగాణ, రాయలసీమ మంత్రులందరూ కలిసి హాయిగా డిన్నర్లు చేసుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ విమర్సించారు. రాష్ట్రం రావణకాష్టంలా మారడానికి కాంగ్రెస్ పార్టీయే అని ఆయన విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో, వికారాబాద్‌లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నడుమ మంటపెట్టి వినోదిస్తోందని విమర్శించారు. సిడబ్ల్యుసి చేసిన తీర్మానాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే వ్యతిరేకించడం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదని నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సానుకూలమని చెప్పి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మాట మార్చి యూటర్న్ తీసుకున్నాయని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ఆ ప్రాంత నేతలదేనన్నారు. సోనియా నిర్ణయం శిరోధార్యమని చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం వైఖరి మార్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు మాట మార్చడంతోనే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరుతో ఆర్టీసీ బస్సులను, ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకుని ప్రైవేటు బస్సులు, పాఠశాలలను వదిలేయడం ఏమిటని ప్రశ్నించారు.

తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 17న సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ నెల23న ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తామని ప్రకటించారు.

English summary
CPI state secretary K Narayana has deplored the attitude of ministers on th issue of Andhra Pradesh bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X