మీ అన్న ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకో..హైపర్ ఆదికి నెటిజన్లు అదిరిపోయే కౌంటర్
జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.
అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు. దీనిలో భాగంగానే జనసేన స్టార్ క్యాంపైనర్ జాబితాలో హైపర్ ఆది స్థానం కల్పించారు. ఈక్రమంలో హైపర్ ఆది జనసేన తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ కోసం షూటింగ్‌లు ఆపేసి వచ్చామని.. ఎన్నికలు అవ్వగానే తిరిగి తమ షూటింగ్‌ల్లో పొల్గొంటామని హైపర్ ఆది తెలిపాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైపర్ ఆది సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లోనే న్యాయం చేయలేనోడు.. మీ ఇంట్లో ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించాడు. వైఎస్ షర్మిల, సునీత ఇద్దరు కూడా జగన్‌కు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నారనే విషయాన్ని హైపర్ ఆది గుర్తు చేశాడు. హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ భార్యల గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లాళ్లను వదిలేసినోడు ప్రజలకి ఏమి చేస్తాడు రా డైపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ముందు. మీ అన్న ఇంట్లో. మంచి వాళ్లు ఉన్నారా. మీ అన్న మంచోడు అయితే. ఇద్దరు భార్యలు వదులుకోరు నాయన. వెల్లి జబర్దస్ట్ చేసుకో. నీకెందుకు రాజకీయాలు అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. మాకు అన్యాయం జరిగింది అని ముగ్గురు ఆడవాళ్ళు తిరుగుతున్నారు దానికి సమాధానం ఏంటి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications