బుల్లెట్ 350 బండెక్కి వచ్చేస్తవా.. డుగ్ డుగ్ డుగ్..!
మోటార్ సైకిల్ మార్కెట్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ది ప్రత్యేక స్థానం. చాలామందికి రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఈ కంపెనీ ఇప్పటికే క్లాసిక్ 350, మెటోర్ 350, ఇంటర్ సెప్టర్ 650 వంటి బైకులున్నాయి. ఈ జాబితాలో కొత్తగా 350 వచ్చి చేరింది. బుల్లెట్ అన్న పేరుకే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీనికితోడు ప్రత్యేక లుక్ తోపాటు రెట్రో స్టయిలింగ్ కు కూడా చాలామంది అభిమానులున్నారు. 2023 బుల్లెట్ 350 మార్కెట్ లోకి వచ్చింది.
దీని ధర రూ.1.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మిలటరీ బ్లాక్, మిలటరీ రెడ్ రంగుల్లో లభిస్తోంది. బేస్ వేరియంట్ ధర రూ.1,73,562గా నిర్ణయించారు. స్టాండర్డ్ మరూన్, స్టాండర్డ్ బ్లాక్ రంగుల్లో మోటార్ సైకిల్ ధర రూ.1,97,436. టాప్ వేరియంట్ ఈ మోడల్ లో బ్లాక్ గోల్డ్ ధర రూ.2,15,801 గా కంపెనీ వెల్లడించింది.

బేసిక్ వేరియంట్లైన మిలటరీ బ్లాక్, మిలటరీ రెడ్ వెనకవైపు డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. మిగిలిన మోడల్స్ లో డిస్క్ బ్రేక్ అమర్చారు. దీనికి 349 సీసీ జె సిరీస్ ఇంజిన్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350, మెటోర్ 350, హంటర్ 350 మోటార్ సైకిల్స్ లో ఇదే సిరీస్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 20 బీహెచ్ పీ పవర్ ను, 27ఎంఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
బుల్లెట్ 350లో ముందువైపు 300 ఎంఎం డిస్క్ బ్రేక్ బిగించారు. వెనకవైపు 270 ఎంఎం బ్రేక్ ఇచ్చారు. సింగిల్ పీస్ సీట్, అప్ రైట్ సీటింగ్ పొజిషన్, దీర్ఘ చతురస్రాకార బాక్స్ ఈ బైకు ప్రత్యేకత. యూఎస్బీ పోర్ట్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, అప్ డేట్ చేసిన ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ వంటివి ఈ బైక్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications