AP DGP: ఏపీలో డీజీపీ రేసు మొదలు-ఛాన్స్ ఎవరి కంటే ?
ఏపీలో త్వరలో కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే జాబితాలో ఎవరున్నారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కీలకమైన డీజీపీ పదవి కోసం ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారుల పేర్లను మాత్రం పరిశీలిస్తోంది.
ఏపీలో ఈ కొత్త ఏడాదిలో కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకు ఎన్నికల తర్వాత అవకాశం ఇచ్చిన కూటమి సర్కార్.. పొడిగింపు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ఆయన స్ధానంలో మరో కొత్త డీజీపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సీఎస్ లకు పదవీకాలం పొడిగింపులు ఇచ్చిన ప్రభుత్వాలు.. డీజీపీల పదవీకాలాన్ని మాత్రం ఎప్పుడూ పొడిగించలేదు. దీంతో కొత్త డీజీపీ రాక తప్పేలా లేదు.

ఎన్నికల తర్వాత కూటమి ప్రబుత్వం నియమించిన ద్వారకా తిరుమల రావు విషయంలో సీఎం చంద్రబాబు విశ్వాసం ఉంటే మాత్రం ఆయనకు పొడిగింపు కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేంద్రంలో ప్రస్తుతం ఉన్న పరపతి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కోరితే డీవోపీటీ ద్వారకాతిరుమలరావుకు పొడిగింపు అవకాశం ఇస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ద్వారకా తిరుమలరావు రిటైర్మెంట్ తేదీ ఖరారైంది. దీన్ని బట్టి చూస్తే పొడిగింపు కష్టమే అంటున్నారు.
గత ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తప్పించింది. ఆయన స్ధానంలో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఆయన్ను తప్పించి ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ద్వారకా తిరుమలరావును పొడిగించకపోతే మాత్రం హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం దక్కనుంది. ఎలాగో ఈసారీ సీనియార్టీని చూసే హరీష్ కుమార్ గుప్తాను అప్పట్లో డీజీపీగా నియమించింది. దీంతో చంద్రబాబు కూడా సీనియార్టీ ప్రకారం వెళ్లాలనుకుంటే గుప్తాకు మరో ఛాన్స్ దక్కనుంది.












Click it and Unblock the Notifications