ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించిన ప్రభాస్

రెబల్ స్టార్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు కొట్టడమే పనైపోయింది. బాహుబలి నుంచి సలార్ వరకు ఇదే వరుస. బాహుబలి 2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలినప్పటికీ ప్రభాస్ అనే కటౌట్ మాత్రం పలు రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. తాజాగా ఈ కోవలోనే సలార్ టీజర్ తో ఆలిండియా రికార్డ్ సృష్టించారు.

 salaar teaser

సరైన మాస్ సినిమా ప్రభాస్ చేతిలో పడితే ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి ఛత్రపతితో చూపించాడు. అదే కటౌట్ కు పాన్ ఇండియాస్థాయిలో పక్కా మాస్ చిత్రం పడితే ఎలా ఉంటుందో? అనే ఉత్కంఠలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులున్నారు. తాజాగా సలార్ వారి కోరిక తీర్చబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 90 సెకన్ల నిడివి ఉన్న సలార్ టీజర్ పాత రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకెళుతోంది.

 salaar teaser

సలార్ టీజర్‌లో ప్రభాస్‌ను చూపించకుండానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూడనంతగా సలార్ కోసం ఎదురు చూశారు. అంతే.. సలార్ విడుదలవడం ఆలస్యం.. సోషల్ మీడియా షేకైపోయింది. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంపై చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. 12 గంటల్లోనే 45 మిలియన్ వ్యూస్, 1.3 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

 salaar teaser

'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్' ఇండియాలో గతంలో ఏ సినిమా టీజర్ అందుకోనంత బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. సింగిల్ ఛానెల్లో 83 మిలియన్స్‌, 1.6 మిలియన్స్‌ లైక్స్ అందుకున్న ఏకైక టీజర్‌గా ఇది నిలిచింది. అంతేకాదు.. ప్రభాస్ తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు. ఆదిపురుష్ టీజర్‌ 24 గంటల్లో 69 మిలియన్స్ వ్యూస్ రాబట్టగా ఆ తర్వాత స్థానంలో 68 మిలియన్స్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్ చాప్టర్ 2 నిలిచింది. ఆ తర్వాత స్థానం కూడా ప్రభాస్‌దే కావడం విశేషం. మొత్తంగా ఈ రెబల్ స్టార్ తన రికార్డులను తనే తిరగరాయగలుగుతున్నాడు. సలార్ విడుదలయ్యే సెప్టెంబర్ 28న ఇంకెన్ని రికార్డ్స్ క్రియేటవుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+