వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి కుటుంబానికి 10 పొట్టేళ్లు:ఎపి గవర్నమెంట్ సరికొత్త పథకం

|
Google Oneindia TeluguNews

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ 10 పొట్టేళ్లు అందించే సరికొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పలకనుంది. అంతేకాకుండా ఆ పొట్టేళ్లకు మేత, బీమా, వైద్యసౌకర్యాలు కల్పించి వృద్దికి తోడ్పడటం ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడేలా చేయూతనివ్వాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం యాదవులకు, కురబలకు గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎపి ప్రభుత్వం ఆ పథకంలోని లోపాలను సైతం సవరించి మరింత ఎక్కువమందికి లబ్ది చేకూరేలా ఈ సరికొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేవలం కొన్ని సామాజికవర్గాల వారికే కాకుండా రాష్ట్రంలో ఆసక్తి కలిగిన ప్రతి కుటుంబానికీ ఈ పొట్టేళ్ల పంపిణీ పథకం అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎపి సరికొత్త స్కీమ్...పొట్టేళ్ల పెంపకం

ఎపి సరికొత్త స్కీమ్...పొట్టేళ్ల పెంపకం

ఎపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నయా పథకం అమలులోకి తేనుంది. అది పొట్టేళ్ల పెంపకం ద్వారా ఆదాయం ఆర్జించడం. ఈ తరహా పథకాన్ని ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్నా...ఆ పథకంలోని లోపాలను సవరించడమే కాదు మరింత ఎక్కువమంది...ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేలా ఎపి ప్రభుత్వం ఆ పథకాన్ని సవరించి సరికొత్త ఫార్మాట్ లో అమలుకు సంసిద్దమయింది. తెలంగాణా ప్రభుత్వ అమలు చేస్తున్న గొర్రెల పెంపకం పథకం వల్ల ఊహించిన మేర ఆదాయం ఆర్జించే అవకాశాలు లేకపోవడంతో పాటు గొర్రెలను బయటకు తీసుకెళ్లి మేపుకొనే వారికి మాత్రమే వాటి వల్ల ఉపయోగం ఉండటం వంటి లోపాలపై ఎపి అధికారులు దృష్టి సారించారు.

లోపాల సవరణ...మరింత ఆదాయ ఆర్జన

లోపాల సవరణ...మరింత ఆదాయ ఆర్జన

దీంతో ఆ పథకంలోని లోపాలను సవరించే దిశలో ఎపి ప్రభుత్వ అధికారులు సరికొత్తగా ఆలోచించారు. గొర్రెల కంటే పొట్టేలు పిల్లలను కొనిచ్చి, వాటన్నింటినీ ఒక్కచోటనే ఉంచి మేపడం ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చని అంచనావేశారు. అలాగే ఆ పొట్టేళ్ల మేత విషయంలో కూడా ప్రభుత్వమే సహకారం అందించడం, అలాగే వాటికి వైద్య సదుపాయం, భీమా సౌకర్యం వంటివి కూడా కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఎపి అధికారులు భావిస్తున్నారు.
అంతే కాకుండా కులాలతో సంబంధం లేకుండా ప్రతి డ్వాక్రా సంఘ సభ్యురాలికి ఈ స్కీమ్ వర్తింపచేయాలని నిర్ణయించారు.

పైలట్ ప్రాజెక్ట్...కర్నూలు జిల్లాలో...

పైలట్ ప్రాజెక్ట్...కర్నూలు జిల్లాలో...

సెర్ప్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాల్లో ఈ స్కీమ్ ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎపి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా గ్రామీణుల జీవనోపాధులల్లో మంచి మెరుగుదల కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పంగా తెలుస్తోంది. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించాలన్నఎపి ప్రభుత్వ లక్ష్యానికి చేరువ అయ్యేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈ నూతన పథకం కూడా అమలు చేయాలని, అదికూడా వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేయాలని సిఎం చంద్రబాబు యోచిస్తున్నారట.

సుస్థిర ఆదాయం...ఆర్జనకు బాటలు...

సుస్థిర ఆదాయం...ఆర్జనకు బాటలు...

ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఎకరాల్లో పండ్లతోటలను పెంచి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎపి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమలను ఓ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు పొట్టేలు పిల్లల పెంపకంపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావించింది. గతంలో గొర్రెలు, మేకల పెంపకం చేపట్టే రైతులకు నిర్ధిష్టమైన ప్రోత్సాహకాలు అందించకపోవడం వల్లే సుస్థిర అభివృద్ధి సాధించలేకపోయారన్న అభిప్రాయం సిఎం మదిలో ఉందంటున్నారు. అందువల్లే ఈ పొట్టేళ్ల పెంపకం పథకం ద్వారా అధిక ఆదాయం పొందే పరిస్థితులను ఖచ్చితంగా సృష్టించాలని భావించారని తెలుస్తోంది.

అన్నీ ఆలోచించి...పక్కాగా ప్లాన్...

అన్నీ ఆలోచించి...పక్కాగా ప్లాన్...

అయితే ఈ పథకం చేపట్టిన వారికి నామకేవాస్త్ సాయం కాకుండా ఒకే చోట పొట్టేళ్ల పిల్లల ఫారం ఏర్పాటుచేయించడం...తద్వారా గ్రామీణ మహిళలు స్వయం ఉపాధికి ఢోకా లేకుండా చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. ఆ క్రమంలో ఒక్కో మహిళకు 10 పొట్టేళ్లు చొప్పున పంపిణీ చేసి, వాటిని మేపేందుకు అవసరమైన అన్నీ సదుపాయాలు,వసతులు కల్పించనున్నారు. ఈ విధంగా తొలి విడతలో లక్ష యూనిట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే స్త్రీనిధి/ఉన్నతి ద్వారా 10 పొట్టేళ్ల పిల్లల కొనుగోలు చేసేందుకు రూ.40 వేలు రుణంగా అందిస్తారు. ఆసక్తి కలిగిన పాడిరైతులకు నీటి సదుపాయం కలిగిన 5-10 సెంట్ల భూమి కలిగి ఉన్న వారికి సెర్ప్‌ తరపున గడ్డి పెంపకానికి కణుపులను నర్సరీల ద్వారా పెంచి అందిస్తారు.

గడ్డి కొరత లేకుండా...వృధా కాకుండా

గడ్డి కొరత లేకుండా...వృధా కాకుండా

ఇలా పెరిగే గడ్డి సుమారు ప్రతి 45-60 రోజులకోసారి కోతకు వస్తుంది. అయితే ఈ పెంచిన గడ్డిని నేరుగా వేయడం వల్ల మేత వృథా అయ్యే అవకాశముంది. అందుకే ఈ గడ్డిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వమే గడ్డి కత్తిరించే యంత్రాన్ని అందిస్తుంది. రూ.50 వేల విలువ చేసే యంత్రాన్ని పశు సంవర్థకశాఖ సహకారంతో 50 శాతం సబ్సిడీతో అందిస్తారు. ఈ యంత్రాన్ని ఇంటికి సంబంధించి అనేక రకాల పిండిలను ఆడించుకునేందుకు వినియోగించుకోవచ్చు. దీనిని కూడా స్త్రీనిధి, ఉన్నతి పథకం ద్వారా రుణం అందిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే చొప్ప, కంకులు, వేరుశనగపొట్టు నుంచి దాణా తయారుచేసేందుకు ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల ద్వారా శిక్షణ కూడా ఇప్పించనున్నారు.

నష్టపోకుండా భీమా...సరళతరం...

నష్టపోకుండా భీమా...సరళతరం...

ఈ పథకం ద్వారా పొట్టేలు పిల్లలు పెంచుతున్న లబ్ధిదారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని విపత్తు వల్ల పొట్టేలు పిల్లలు చనిపోయిన పరిస్థితుల్లో వారు నష్టపోకుండా ఉండేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. అలాగే పొట్టేలు పిల్లలకు భీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ భీమా నిబంధనలు కూడా అత్యంత సరళతరంగా ఉండేలా అవసరమైతే నిబంధనల్లో మార్పు చేసి పొట్టేళ్ల పెంపకందారులకు సత్వరమే సాయం, సహకారం అందేలా నిబంధనలు రూపొందించాలని సెర్ప్‌ సీఈఓ ఇప్పటికే అధికారులను ఆదేశించారని తెలిసింది.

English summary
Amaravathi:Andhrapradesh CM Chandrababu has giving special attention to the agricultural sectors in fast few years to encourage the productivity of lands and farmers in a positive way. In this background the Ram rearing scheme will be introduced in Andhra pradesh state soon for the people who are interested in the animal husbandry farming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X