కొత్త మలుపు: 'కలెక్టరే జగన్ చొక్కా పట్టుకొని లాగారు, ఆధారాలతో కోర్టుకు'

నందిగామ ఆసుపత్రి వద్ద వైసిపి అధినేత వైయస్ జగన్ - కలెక్టర్ బాబుల మధ్య జరిగిన వాగ్వాదం అంశం కొత్త మలుపు తిరిగింది. వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ ఓ షాకింగ్ విషయం చెప్పారు.

విజయవాడ: నందిగామ ఆసుపత్రి వద్ద వైసిపి అధినేత వైయస్ జగన్ - కలెక్టర్ బాబుల మధ్య జరిగిన వాగ్వాదం అంశం కొత్త మలుపు తిరిగింది. వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ ఓ షాకింగ్ విషయం చెప్పారు.

నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం వివరాలు అడుగుతున్న జగన్‌ను వెనుక నుంచి కలెక్టర్ బాబు షర్టు పట్టుకుని లాగాడని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అరుణ్ కుమార్‌ ఆరోపించారు.

1 ఆధారాలతో కోర్టుకు వెళ్తామన్న వైసిపి

1 ఆధారాలతో కోర్టుకు వెళ్తామన్న వైసిపి

గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సదరు ఆధారాలతో తాము కోర్టుకు వెళనున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ వచ్చాడని, ఆయనకు కనీస రక్షణ కూడా ఇవ్వకుండా టిడిపి గూండాలతో పోలీసులు, కలెక్టర్‌ నినాదాలు చేయించారన్నారు.

ప్లాన్ ప్రకారమే..

ప్లాన్ ప్రకారమే..

ణాళిక ప్రకారమే కలెక్టర్‌ బాబు జగన్‌ను అడ్డుకుని గొడవ సృష్టించాడని ఆరోపించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిలదీసినందుకే జగన్‌పై కేసు పెట్టారన్నారు.

టిడిపి ఎంపీలు కాబట్టే...

టిడిపి ఎంపీలు కాబట్టే...

కేశినేని ట్రావెల్స్, దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమంగా బస్సులు నడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ ఇద్దరు అధినేతలు టీడీపీ ఎంపీలు కాబట్టే వారిని ఉపేక్షిస్తున్నారన్నారు.

సీఎం తర్వాత కీలక పదవిలో జగన్...

సీఎం తర్వాత కీలక పదవిలో జగన్...

ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో కీలకమైన పదవిలో ఉన్న జగన్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. టిడిపి ఏజెంటులా వ్యవహరించిన కలెక్టర్‌కు ఐఏఎస్‌ల సంఘం మద్దతు తెలపడం బాధాకరమన్నారు.

ఐఏఎస్‌ల సంఘానికి ఆధారాలిస్తాం

ఐఏఎస్‌ల సంఘానికి ఆధారాలిస్తాం

కలెక్టర్‌ బాబు ప్రవర్తనపై తన వద్ద ఉన్న ఆధారాలను సంఘానికి కూడా అందిస్తామని తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి కేసులు వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+