పవన్ - కేటీఆర్- రేవంత్ పై చంద్రబాబు మనసులో మాట : లోకేష్ ఫ్యూచర్ పై క్లారిటీ..!!
పవన్ కల్యాణ్..కేటీఆర్..రేవంత్ గురించి చంద్రబాబు తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబు తన మనసులో మాటలను బయట పెట్టారు. పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసారు. కేటీఆర్ గురించి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ తీరు ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు. ఇక..లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి చంద్రబాబు స్పష్టంగా తేల్చి చెప్పారు. తనకు ఎన్నికల్లో ఓటమి కంటే బాధ కలిగించిన అంశాన్ని వివరించారు. జాతీయ నేతల్లో తనకు ఇష్టమైన నేత ఎవరో స్పష్టం చేసారు.
తన కాలేజీ రోజుల నుంచి వైఎ్ససార్ తో అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలయ్య నిర్వహించిన టాక్ షో లో పాల్గొన్న చంద్రబాబు ఇప్పుడు నిజం విత్ స్మిత కార్యక్రమంలో కీలక అంశాల పైన చంద్రబాబు స్పందించారు. తన మనసులోని అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు.

పవన్ - లోకేష్ - కేటీఆర్- రేవంత్ పై చంద్రబాబు మాట
టాక్ షో లో భాగంగా చంద్రబాబు నలుగురి గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. పవన్ కల్యాణ్ సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. లోకేష్ గురించి స్పష్టత ఇచ్చారు. లోకేష్ బాగా చదువుకోవటంతో పాటుగా సంస్కారం ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. భవిష్యత్ ను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని చాలా క్లియర్ గా చెప్పారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ గురించి స్పందించిన చంద్రబాబు.. కేటీఆర్ ఒక వ్యూహం ప్రకారం తాను అనుకున్నది సాధించటం కోసం పని చేసే వ్యక్తిగా అభిప్రాయపడ్డారు. బెస్ట్ కమ్యునికేటర్ గా ప్రశంసించారు. ఇక..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు పోతారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రజల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని రేవంత్ గురించి చంద్రబాబు తన అభిప్రాయంగా వెల్లడించారు. లోకేష్ విషయంలో తాను ఏం కోరుకుంటన్నదీ చంద్రబాబు ఈ సమాధానం ద్వారా ఒక్క మాటలోనే తేల్చి చెప్పారు.

హరోయిన్ - జాతీయ నేతల్లో ఎవరంటే అభిమానం
ఇదే షో లో చంద్రబాబు తాను అభిమానించే జాతీయ నేతల్లో తొలి స్థానం వాజపేయి కి ఇచ్చారు. తరువాత మన్మోహన్ సింగ్, పీవీ నర్సింహారావు, ఇందిరా గాంధీ గా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తన అభిమాన నటి ఎవరో బయటకు చెప్పని చంద్రబాబు..తొలి సారి శ్రీదేవి గొప్ప నటిగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతానని చంద్రబాబు స్పష్టం చేసారు.
ఇక, చంద్రబాబు తనకు ఎన్నికల్లో ఓటమి కంటే అమరావతి అంశమే అత్యంత బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. నాయకుడిగా ఎదగాలంటే ముందుగా విజన్.. తరువాత స్ట్రేటజీ తో పాటుగా క్రమశిక్షణ.. కమ్యూనికేషన్..రిలేషన్ బిల్డింగ్ ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
1995 వెన్నుపోటు అంశం పైన మరోసారి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. నాడు ఏం జరిగిందీ వివరించారు. నాడు ఆ ఘటనకు కారకులైన వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చూస్తున్నారని..వారి పేర్లు తాను చెప్పనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రేమ వ్యవహారాలు - వైఎస్సార్ తో బంధం గురించి..
చంద్రబాబు తన కాలేజీ రోజుల్లోని ప్రేమ వ్యవహారాల గురించి వివరించారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని..కానీ, తక్కవేనని చెప్పారు. అందులో కొన్ని వన్ సైడ్ ఉండొచ్చన్నారు. తాను గాఢమైన ప్రేమలో పడటం..భగ్న ప్రేమికుడిగా మారటం జరగలేదన్నారు. ఇక..వైఎస్సార్ తో సన్నిహితంగా గడిపిన సందర్భాలను వెల్లడించారు.
ఇద్దరం కాంగ్రెస్ లో కలిసి పని చేసామన్నారు. 1995లో తాను సీఎం అయినా.. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయినా..రాజకీయంగా విభేదించుకున్నామని చెప్పిన చంద్రబాబు..వ్యక్తిగతంగా గౌరవించుకున్నామని చెప్పుకొచ్చారు.
దేశంలో యూనివర్సిటీల చదువుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి తానే అనుకుంటానని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు పవన్..కేటీఆర్..రేవంత్..లోకేష్ గురించి చెప్పిన అభిప్రాయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications