ఏపీకి కేంద్రం లక్ష కోట్ల కొత్త ప్రాజెక్టు - గేమ్ ఛేంజర్..!!

ఏపీకి కేంద్రం కొత్త వరం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే అదే వేదిక పైన ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి గడ్కరీ ఏపీ పర్యటనలో కీలక ప్రకటన చేసారు. ఏపీకి రానున్న రెండేళ్లలో లక్ష కోట్ల రోడ్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో అమెరికాతో ఏపీ రోడ్లు పోటీ పడే విధంగా ఉంటాయని.. తాను మాటిస్తే చేసి చూపిస్తానని గడ్కరీ స్పష్టం చేసారు. దీంతో, ఈ నిర్ణయం రానున్న కాలంలో ఏపీకి గేమ్ ఛేంజర్ గా మారనుంది.

రాష్ట్రంలో పర్యటించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మొత్తంగా 5 వేల 233 కోట్ల విలువైన జాతీయరహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మిస్తామని కేందమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇది పూర్తైతే హైదరాబాద్​కు రెండు గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. ఏపీలో లక్ష కోట్ల విలువైన పనులు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రెండు నెలల్లోనే అమెరికాతో సమానంగా ఏపీలో రోడ్లు తయారవుతాయని వెల్లడించారు. ఇథనాల్, మిథనాల్‌, సీఎన్‌జీ, బయోడీజిల్‌ వేగంగా వస్తున్నాయని, ఈవీ వాహనాల తయారీ శరవేగంగా పెరుగుతోందని గడ్కరీ పేర్కొన్నారు.

Nitin Gadkari Assured on lakh cr projects for AP in next Two years

సంపద సృష్టికి దారులు రహదారులేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాను అడిగిన వెంటనే వేదిక పైనే 27 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రమంత్రి గడ్కరీ అంగీకారం తెలిపినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. రూ.85,000 కోట్లు విలువ చేసే రహదారులు అడిగితే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు హామీ ఇచ్చిన గడ్కరీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తుంటే, గడ్కరీ దానిని ముందుకు తీసుకువెళుతున్నారని ప్రశంసించారు. జలవనరులశాఖ మంత్రిగా గడ్కరీ పోలవరం ప్రాజెక్టుకు ఊపిరిపోశారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి భూసేకరణ సమస్య ఉండదన్న సీఎం, కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

హబ్ అండ్ స్పోక్ తరహాలో రాష్ట్రంలో 20 పోర్టులు తయారుచేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 9 విమానాశ్రయాలు సిద్ధం కావాలని సూచించారు. బకింగ్‌హామ్‌ కెనాల్ ద్వారా కాకినాడ నుంచి చెన్నైకి సరకు రవాణా రూటు ఏర్పాటు చేయాలనుకున్నామని గుర్తుచేశారు. రాష్ట్రానికి రెండు రోప్ వేలు ఇప్పటికే మంజూరయ్యాయన్న సీఎం, మరో నాలుగు కూడా మంజూరు చేసేందుకు గడ్కరీ అంగీకారం తెలిపారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+