పవన్ కు ఉన్నది అభిమానులు కాదు - భక్తులు: రాజకీయంగా మాత్రం - చిరంజీవి..!!

పవన్ కల్యాణ్ రాజకీయాలు..అభిమానులకు సంబంధించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని చెబుతున్న చిరంజీవి.. పవన్ ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు వెళ్తారంటూ పలు మార్లు చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఇప్పుడు పవన్ రాజకీయాలతో పాటుగా పవర్ స్టార్ ను ఆరాధించే అభిమానుల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పవన్ కున్న ఫ్యాన్స్ బేస్ డిఫరెంట్ అని చెప్పుకొచ్చారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో జం విత్ స్మిత ప్రోగ్రాంలో చిరు మొదటి గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరు ఎవరికి చెప్పని నిజాలను బయటపెట్టారు. తన సినీ - రాజకీయ జీవితంలో కీలక అంశాలను వెల్లడించారు.

పవన్ గొప్ప నాయకుడు అవుతారు

పవన్ గొప్ప నాయకుడు అవుతారు


మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ సక్సస్ ఖాయమని చెబుతున్నారు. తమ్ముడు రాజకీయ భవితవ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచి సమాజానికి మంచి చేయాలనే తపనతో ఉండేవారని చెప్పారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన, బాధలకు స్పందించే తీరు అతనిలో చిన్నప్పటి నుంచి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సహజత్వాన్ని బట్టి చూస్తే ఏదో ఒక రోజు గొప్ప నాయకుడు అవుతాడని అన్నారు. పవన్ నటుడుగా కంటే పొలిటిషన్ గానే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కున్న ఫ్యాన్స్ బేస్ డిఫరెంట్ అన్న మెగాస్టార్.. వాళ్లను అభిమానులు అనొద్దని, భక్తులు అనాలని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ అభిమానులు గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా

శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా


ఈ షోలో చిరంజీవి తాను సీనీ - రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. తనకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్ ఫాదర్ లేనరని చెప్పారు. మద్రాస్ వెళ్లిన కొత్తలో పాండిబజార్ వెళ్తే అక్కడ ఒకతను నన్నుచూసి నువ్వు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కి వచ్చావా.. అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతని కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే ఇక్కడ రాణించడం కష్టమని చెప్పిన అంశాన్ని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలను తన మనసుని అవి బాధ పెట్టాయన్నారు. ఆ సమయంలో ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు. అప్పటి నుంచి విమర్శలు పట్టించుకోకూ డదని డిసైడ్ అయ్యానని చెప్పారు. తన సినీ కెరీర్ ప్రారంభం సమయంలో తన మెడలో ఉన్న హనుమంతుడి వెండి లాకెట్ ప్రత్యేకత గురించి చిరంజీవి వివరించారు. సినిమా షూటింగ్ లో అదెక్కడో పడిపోయిందని..ఆ సమయంలో తానెంతగా టెన్షన్ పడిందీ చిరంజీవి చెప్పుకొచ్చారు.

ముందు పూలు - కోడిగుడ్లు విసిరారు

ముందు పూలు - కోడిగుడ్లు విసిరారు


ఏ రంగంలో అయినా ఎదిగే క్రమంలో ఎన్నో అనుమానాలు - అవమానాలు ఉంటాయి. ఇలాంటిదే చిరంజీవి ఎదుర్కొన ఒక ఘటన గురించి ఈ టాక్ షో లో వివరించారు. తాను జగిత్యాల వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులు పూలవర్షం కురిపించారని.. అదే సమయంలో కొంతమంది తన పైన కోడిగుడ్లు విసిరారని మెగాస్టార్ తెలిపారు. ఇక..పవన్ కల్యాణ్ కు సంబంధించి ఆసక్తి కర అంశాలను ఈ షోలో చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి ఎక్కువగా గన్స్ కావాలని కోరుకొనే వాడని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు సుస్మిత-రాం చరణ్ కొట్టుకుంటుంటే పవన్ ఏ రకంగా వ్యవహరించే వారో చిరంజీవి వివరించారు. ఈ షో ద్వారా చిరంజీవి పలు కీలక అంశాల పైన స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+