• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు... ఆయన మాటలు ఎందుకు పట్టించుకోవాలి?

|

ఎమ్మెల్యే కూడ కాని.... పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హోంమత్రి మేకతోటి సుచరిత అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తన సీటును కూడా తాను గెలుచుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు.. అలాంటి వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. మరోవైపు ఆయన మతమార్పిడులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. బలవంతంగా ఎవరు మతాన్ని మార్చుకోరని ఆమె వివరణ ఇచ్చారు. ప్రలోభాలతో మతాల మధ్య మార్పిడిలు జరగవని, మతమనేది ఒక విశ్వాసామని చెప్పారు.

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే....సీఎం ప్రోద్బలంతోనే మతమార్పిడులు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో సీఎం నివాసానికి సమీపంలోనే నలబై మందిని మతమార్పిడులు చేశారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

No need to Respond on Pawan Kalyan comments

ఇవి ఎవరి ప్రోద్బలంతో జరగుతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు.. ఇందుకు సంబంధించి తాను వీడియోను కూడా రిలీజ్ చేస్తానని, ఆ వీడియోను మీడియా సెన్సేషన్ వార్తగా ప్రచురించుకోవచ్చని కూడా కోరారు. ధర్మం గురించి మాట్లాడే వ్యాఖ్యలకు తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని వాటి నుండి ఎప్పుడు వెనక్కి వెళ్లనని పవన్ స్పష్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No need to Respond on PawanKalyan comments, because he is not even as mla AP Home Minister Sucharita said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more