పొట్లూరికి షాక్, నో చెప్పి పవన్‌కళ్యాణ్: బిజెపి కూటమికే
హైదరాబాద్: విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి చేదు అనుభవం ఎదురయిందట. బిజెపి లేదా బిజెపి తరఫున విజయవాడ నుండి పోటీ చేయాలని పొట్లూరి భావించారు.
ఆ పార్టీల నుండి టిక్కెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ సహకారం కోరారు. ఆయన మూడు రోజులుగా పవన్‌ను కలుస్తున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు మద్దతివ్వాలని, తన తరఫున ప్రచారం చేయాలని కోరారు.

దీనిపై శుక్రవారం సాయంత్రం పవన్ ఏం చేస్తారనే విషయం చెబుతారని వార్తలు వచ్చాయి. అయితే, పవన్ పొట్లూరికి మద్దతు అంశంపై బహిరంగంగా స్పందించక పోయినప్పటికీ ఆయనతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను మద్దతివ్వలేదని పవన్ ఆయనకు సూటిగా చెప్పేశారట. దీంతో శనివారం నామినేషన్ దాఖలు చేద్దామనుకున్న పివిపి అందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. పవన్ మద్దతిస్తే రేపు మధ్యాహ్నం నామినేషన్ వేయాలని ఆయన భావించారు. అయితే పవన్ నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆయన తగ్గారట. పవన్ బిజెపి - టిడిపిల కూటమికే ప్రచారం చేయాలని భావిస్తున్నారట. బిజెపి-టిడిపికి మద్దతిచ్చాక స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తే బాగుండదని పవన్ సన్నిహితులు ఆయనకు సూచించారట.












Click it and Unblock the Notifications