• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈసారి కూడా టీడిపి జెండా పండుగ లేనట్టే..! మహానాడుపై కన్నెర్ర చేసిన కరోనా..!!

|

అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మహానాడు పర్వదినంపై కరోనా వైరస్ ప్రభవం చూపబోతోంది. సుమారు పది వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకపై కరోనా నీడలు అలుముకున్నాయి. కరోనా మహమ్మారి ప్రకోపంతో ప్రపంచ దేశాలు షట్ డౌన్ అయిన నేపథ్యలో భారత దేశంలో కూడా లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడితే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలెవ్వరిని రోడ్ల మీదకు తిరగనివ్వకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

 టీడిపి మహానుడుపై కరోనా నీడలు..

టీడిపి మహానుడుపై కరోనా నీడలు..

ఈ నేపథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని టీడిపి శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకండా నిర్వహించుకునే మూడు రోజుల మహానాడు పండుగ రద్దైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల పేరుతో గతేడాది జరగాల్సిన ఇదే మహానాడు అనూహ్యండా రద్దైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతియేటా ఘనంగా నిర్వహించుకునే మహానాడు వరుసగా రెండు పర్యాయాలు రద్దవ్వడం ఇదే మొదటి సారి. అంతే కాకుండా ప్రతి రెండేళ్లకోసారి జరిగే పార్టీ అద్యక్ష ఎన్నిక కూడా ఈ మహానాడు కార్యక్రమంలోనే నిర్వహిస్తారు.

 ఈ వారంలో ముఖ్యనేతలతో బాబు సమావేశం..

ఈ వారంలో ముఖ్యనేతలతో బాబు సమావేశం..

ఇదిలా ఉండగా మూడు రోజులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే మహానాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గానీ, కార్యకర్తల్లో గాని పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపుతుందనే నమ్మకం క్యాడర్ లో ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీ సభ్యులకు మహానాడు పండుగ ఆక్సీజన్ లాంటిదనే చర్చ కూడా కార్యకర్తల్లో చోటుచేసుకుంటుంది. పర్టీ పటిష్టత కోసం వినూత్నమైన తీర్మాణాలు ప్రవేశపెట్టడం, పార్టీ మనుగడ కోసం నిధులు సేకరించడం, వ్యవస్థాపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడం, భవిశ్యత్ ప్రణాళికలు అమలు చేయడం, పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడం వంటి కీలక నిర్ణయాలు ఈ మహానాడు కార్యక్రమంలో లేనే తీసుకోవడం ఆనవాయితీ. అన్నిటికంటే కీలకమైన అద్యక్ష ఎన్నిక కూడా ప్రతి రెండేళ్లకొక సారి నిర్వహిస్తారు. అది కూడా ఈ మహానాడు వేదికలోనే నిర్వహాస్తారు.

కార్యకర్తలకు టానిక్ లాంటి మహానాడు..

కార్యకర్తలకు టానిక్ లాంటి మహానాడు..

ఇక పార్టీ అధ్యక్షుడి నుండి సామాన్య కార్యకర్త వరకూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి హాజరవ్వడాన్ని ప్రతి కార్యకర్తం ప్రతిష్టాత్మకంగా భవిస్తుంటారు. అందుకే మండిపోయే మే నెల ఎండలను కూడా లెక్క చేయకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ మహానాడు నిర్వహించినా విధిగా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు పార్టీ శ్రేణులు. మహానాడు కార్యక్రమానికి హాజరవ్వడం, సభా ప్రాంగణంలో పోటోలు దిగడం, నేతల ప్రసంగాలకు కేరింతలు కొట్టడం, సాంస్క్రుతిక కార్యక్రమాలకు మైమరిచి నృత్యాలు చేయడం వంటి సందర్బాలను టీడిపి శ్రేణులు వినూత్నంగా ఆస్వాదిస్తుంటారు. వరుసగా రెండో యేడాది కూడా ఈ కార్యక్రమం రద్దవ్వడం పట్ల క్యాడర్ లో అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తోంది.

  TDP 39th Formation Day | Chandrababu Naidu's Message
  త్వరలో ముఖ్య నేతలతో బాబు సమావేశం..

  త్వరలో ముఖ్య నేతలతో బాబు సమావేశం..

  తెలుగుదేశం పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్తువ‌లు నింపే మహానాడు కార్యక్రమంపై పార్టీ అద్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలో భేటీ నిర్వహిచబోతున్నారు. మ‌హానాడు నిర్వ‌హ‌ణ పై పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో బాబు చ‌ర్చించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్ ను కాపాడుకుంటూనే నాయ‌కుల్లో ఉత్సాహం నింపేందుకు మహానాడుకు ప్రత్యామ్నాయంగా నాయకులు ఏం చేయాలనే అంశంపై బాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఈ వారంలో జూమ్ యాప్ ద్వారా జ‌ర‌గ‌బోయే స‌మావేశంలో కొంత మంది ముఖ్య నేత‌ల‌తో బాబు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి ఇదే అంశాన్ని చ‌ర్చించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మహానాడు వరుసగా రెండేళ్లు రద్దవ్వడం పట్ల క్యాడర్లో నిరుత్సాహం కలగకుండా వాస్తవ పరిస్థితులను వివరించి భరోసా నింపాలని చంద్రబాబు నాయకులకు దిశానిర్దేశం చేయునున్నట్టు తెలుస్తోంది.

  English summary
  From the party president to the general worker, they are very enthusiastic. Every activist aspires to attend the three-day Mahanadu event.The cadre seems to be unhappy with the cancellation of the event for the second consecutive year.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X